Ram Charan : మెగాహీరో కోసం వస్తున్న రామ్ చరణ్..!

సుప్రీం హీరో సాయి తేజ్ ప్రస్తుతం 'SDT18' టైటిల్ టీజర్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అఫషియల్ గా అనౌన్స్ చేశారు. డిసెంబర్ 12 న ఇందుకు సంబంధించిన ఈవెంట్ జరగనుందని, దీనికి రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు తెలిపారు.

New Update
charan (1)

'విరూపాక్ష' మూవీతో భారీ హిట్ అందుకున్న సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ప్రస్తుతం 'SDT18' పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ‘హనుమాన్’ వంటి పాన్ ఇండియా మూవీని నిర్మించిన కె నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రంతో రోహిత్‌ కేపీ దర్శకుడిగా పరిచయం కానున్నారు. 

రీసెంట్ గా సాయి తేజ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. గ్లింప్స్‌లో సాయి దుర్గ తేజ్‌ కండలు తిరిగిన దేహంతో శక్తివంతమైన శూలాన్ని పట్టుకొని కనిపించాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. 

Also Read : నా కుక్క ప్రేమ కంటే ఏ ప్రేమ గొప్పది కాదు.. చైతూ టార్గెట్ గా సమంత పోస్ట్

రామ్ చరణ్ గెస్ట్ గా..

ఈ సినిమా టీజర్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అఫషియల్ గా అనౌన్స్ చేశారు. డిసెంబర్ 12 న యూసుఫ్ గూడ లోని శౌర్య కన్వెన్షన్ సెంటర్, పోలీస్ గ్రౌండ్స్ లో ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరగనుందని, ఈ ఈవెంట్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా రానున్నారని వెల్లడించారు. 

ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారేమోనని ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక SDT18 మూవీలో  ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ  తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు