/rtv/media/media_files/2025/03/17/ADIwhBPeDGDGKhnTpPYs.jpg)
MS Dhoni in RC16
MS Dhoni in RC16: బుచ్చిబాబు(Bucchi Babu) దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) చేస్తున్న RC16 సినిమా పై రోజుకొక పుకారు షికారు చేస్తోంది. ఈ మూవీ పల్లెటూరు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ కావడంతో, ఈ మూవీ లో ఓ ప్రముఖ క్రికెటర్ పాత్ర కోసం మహేంద్ర సింగ్ ధోనిని తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
రామ్ చరణ్, ధోని మంచి స్నేహితులు కావడంతో ఆ వార్త నిజమే అని చాలా మంది అనుకున్నారు. కాబట్టి చరణ్ కోసం ధోని ఈ మూవీ లో కనిపిస్తారని అంతా భావించారు. రీసెంట్ గా నితిన్ "రాబిన్ హుడ్" సినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించారు. అలాగే ధోని కూడా చరణ్ మూవీ లో కనిపిస్తున్నాడు అని సోషల్ మీడియా లో తెగ చేర్చ నడుస్తోంది.
Also Read: Court Movie: కంటెంట్ ముఖ్యం బిగులు.. పావురాలు ఎగరేస్తూ 'కోర్ట్' టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్!
మా సినిమాలో ధోని లేడు..
అయితే, ఈ ప్రచారాన్ని మూవీ యూనిట్ తాజాగా ఖండించింది. తమ సినిమాలో ధోనీ నటించడం లేదని, అలాంటి పాత్రేమీ తమ మూవీలో లేదని క్లారిటీ ఇచ్చింది. పుకార్లు మాత్రమే కాదు తాజాగా మూవీ షూటింగ్ వీడియో కూడా సోషల్ మీడియాలో లీక్ అవ్వడం, ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న ఎ. ఆర్. రెహమాన్ కి ఆరోగ్యం దెబ్బ తినడం ఇలా RC16 కి అనేక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి.
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!
అయితే 58 ఏళ్ల రెహ్మాన్ ఛాతి నొప్పితో హాస్పిటల్‌లో చేరింది నిజమే కానీ అది హార్ట్ ఎటాక్ కాదని ఆయన డీ-హైడ్రేషన్ కారణంగా ఇబ్బంది పడుతున్నారని వైద్యులు చెప్పారు. ఎ. ఆర్. రెహమాన్ త్వరగా కోలుకొని చరణ్ సినిమాకు మంచి సంగీతాన్ని అందించాలని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' నిరాశ పరచడంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఆశలన్నీ బుచ్చిబాబు సినిమాపైనే ఉన్నాయి. ఎలాగైనా ఈ మూవీ తో రామ్ చరణ్ సూపర్ హిట్ కొట్టాలని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.