ఆలియా భట్ కూతురి కోసం రామ్ చరణ్ ఏం చేశాడో తెలుసా?

'RRR'మూవీ టైంలో రామ్ చరణ్, ఆలియా భట్ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అయితే ఆలియా కూతురి కోసం చరణ్ ఓ గొప్ప పని చేశారట. చరణ్, రాహా పేరు మీద అడవిలో ఒక ఏనుగును దత్తత తీసుకున్నాడు. ఆ విషయం రాహాకు ఏనుగు బొమ్మ పంపించి తెలిపాడని ఆలియా తాజా ఇంటర్వ్యూలో చెప్పింది.

alia charan
New Update

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ 'RRR' మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె రామ్ చరణ్ ప్రేయసిగా సీత పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమా టైంలోనే చరణ్, ఆలియా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అయితే ఆలియా భట్ కూతురి కోసం చరణ్ ఓ గొప్ప పని చేశారట. ఈ విషయాన్ని స్వయంగా ఆలియా రివీల్ చేసింది. 

ఆమె లీడ్ రోల్ లో నటించిన 'జిగ్రా' మూవీ నేడు థియేటర్స్ లో రిలీజయింది. హిందీతో పాటూ తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అలియా భట్.. రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.." చరణ్ నేను RRR సమయంలో క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. ఒకరోజు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒకరు వచ్చి ఏనుగు వచ్చింది అని చెప్పడంతో నేను ఆశ్చర్యపోయాను. 

ఏనుగును దత్తత తీసుకున్నాడు..

రామ్ చరణ్ సర్ మీకు ఏనుగుని పంపించారు అని చెప్పారు. దాంతో నిజమైన ఏనుగు మా ఇంటికి వచ్చిందేమో అనుకున్నాను. అయితే అది రియల్ ఎలిఫెంట్ కాదు. అది చెక్కతో తయారుచేసిన ఏనుగు. చాలా క్యూట్ గా ఉంది. అది రాహా కోసం గిఫ్ట్ గా పంపించాడు. చరణ్ రాహా పేరు మీద అడవిలో ఒక ఏనుగును దత్తత తీసుకున్నాడు. ఆ విషయం ఇలా రాహాకు ఏనుగు బొమ్మ పంపించి తెలిపాడు. 

Also Read : 'బలగం' వేణు కొత్త సినిమా.. 'ఎల్లమ్మ' అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు

అది నాకు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఆ ఏనుగు బొమ్మ మా డైనింగ్ టేబుల్ పక్కనే పెట్టాము. రాహా దాని మీద కూర్చొని తింటుంది.." అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆలియా కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఆలియా కూతురి పేరు మీద రామ్ చరణ్ ఏనుగును దత్తత తీసుకున్నాడనే విషయం తెలిసిన నెటిజన్స్.. చరణ్ నిజంగా చాలా గ్రేట్ అని కామెంట్స్ చేస్తున్నారు.

#ram-charan #alia-bhatt
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe