సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన 'వేట్టయన్' మూవీ ఇటీవల దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 'జై భీమ్' మూవీ ఫేమ్ జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 10 న థియేటర్స్ లో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది.
తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజైన ఈ మూవీ తమిళంలో తప్పితే మిగతా భాషల్లో పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. ఈ క్రమంలోనే ఇప్పడీ సినిమా ఓటీటీలోకి రానున్నట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. 'వేట్టయన్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ భారీగానే ఖర్చు పెట్టిందట.
Also Read : 'KGF' ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పార్ట్-3 పై అప్డేట్ ఇచ్చిన యశ్
నవంబర్ 7 నుంచి..
థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాల కు సినిమా ఓటీటీకి వచ్చేలా ఒప్పందం చేసుకున్నా. కాస్త ముందుగానే ఓటీటీలోకి తీసుకొస్తున్నారట. నవంబర్ 7 న 'వేట్టయన్' ఓటీటీలోకి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే మేకర్స్ నుంచి దీనిపై ప్రకటన రానున్నట్లు సమాచారం.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్, దగ్గుబాటి రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషించారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు.