/rtv/media/media_files/2024/10/23/OZKjv5E9f9MpW2LTxH02.jpg)
కన్నడ హీరో యష్ నటించిన 'కేజీయఫ్' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, కథనం, సంగీతం తో పాటు, రాకీ పాత్రలో యశ్ నటనకు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పార్ట్ - 2 అయితే బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1100 కోట్లు కొల్లగొట్టి రికార్డులు తిరగరాసింది.
ఈ నేపథ్యంలో KGF పార్ట్-3 కోసం మూవీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో యశ్ KGF-3 అప్డేట్ ఇచ్చారు." మేము ప్రామిస్ చేసినట్లుగా ‘కేజీఎఫ్-3’ ఖచ్చితంగా వస్తుంది. మాకు ఒక ఆలోచన ఉంది. దాని ప్రకారంగానే ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సరైన సమయం వచ్చినప్పుడు మీ కూడా ఆ ఆలోచన గురించి వెల్లడిస్తాము. 'KGF-3' భారీగా ప్లాన్ చేస్తున్నారు.
"#KG3 will happen for SURE as we promised. We have an idea, once it's right time, it's going to be MASSIVE. We will do it in a way which the audience will be proud off, because it's a cult. Me and PrashanthNeel are discussing on it"
— AmuthaBharathi (@CinemaWithAB) October 22, 2024
- #Yash pic.twitter.com/iGvwKOfJcd
Also Read : 'రోలెక్స్' పై బిగ్ అప్డేట్ ఇచ్చిన సూర్య
త్వరలోనే షూటింగ్..
ప్రేక్షకులు గర్వపడే విధంగా మేము చేస్తాము. ఎందుకంటే ఇది ఒక కల్ట్ మూవీ. నేను, ప్రశాంత్ నీల్ దీనిపై చర్చిస్తున్నాము. తొందరలోనే ఇందుకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అప్డేట్ కూడా ఇస్తాము. అభిమానులు కొంత సమయం వేచి ఉండండి.." అంటూ చెప్పుకొచ్చారు యశ్.
దీంతో ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్ ను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్.. వచ్చే ఏడాది 'KGF-3' మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Also Read : 'రాజా సాబ్' సర్పైజ్ వచ్చేసింది.. ప్రభాస్ నుంచి ఇది అస్సలు ఊహించలేదు