నెల తిరక్కుండానే ఓటీటీలోకి 'వేట్టయన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'వేట్టయన్' ఓటీటీ అప్డేట్ బయటికొచ్చింది. ఈసినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. నవంబర్ 7 న 'వేట్టయన్' అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే మేకర్స్ నుంచి దీనిపై ప్రకటన రానున్నట్లు సమాచారం.

New Update
vettaiyan

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన 'వేట్టయన్' మూవీ ఇటీవల దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 'జై భీమ్' మూవీ ఫేమ్ జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 10 న థియేటర్స్ లో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. 

తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజైన ఈ మూవీ తమిళంలో తప్పితే మిగతా భాషల్లో పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. ఈ క్రమంలోనే ఇప్పడీ సినిమా ఓటీటీలోకి రానున్నట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. 'వేట్టయన్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.  ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ భారీగానే ఖర్చు పెట్టిందట. 

Also Read : 'KGF' ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పార్ట్-3 పై అప్డేట్ ఇచ్చిన యశ్

నవంబర్ 7 నుంచి..

థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాల కు సినిమా ఓటీటీకి వచ్చేలా ఒప్పందం చేసుకున్నా. కాస్త ముందుగానే ఓటీటీలోకి తీసుకొస్తున్నారట. నవంబర్ 7 న 'వేట్టయన్' ఓటీటీలోకి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే మేకర్స్ నుంచి దీనిపై ప్రకటన రానున్నట్లు సమాచారం. 

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్, మ‌ల‌యాళ స్టార్ ఫహద్‌ ఫాజిల్‌, దగ్గుబాటి రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషించారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు.

Also Read : 'రోలెక్స్' పై బిగ్ అప్డేట్ ఇచ్చిన సూర్య

Advertisment
Advertisment
తాజా కథనాలు