'కూలీ' తెలుగు రైట్స్ కి భారీ డిమాండ్.. ఏకంగా 40 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రముఖ కంపెనీ

రజినీకాంత్ 'కూలీ' మే1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు హక్కుల కోసం అనేక ప్రధాన కంపెనీలు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ రూ.40 కోట్లకు పైగా ఖర్చు చేసి 'కూలీ' కొనడానికి సిద్దమైనట్లు టాక్.

New Update
coolie movie

coolie movie

Coolie:  లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్  హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిల్మ్  'కూలీ'. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో  నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్యరాజ్, శృతి హాసన్ తదితర స్టార్ కాస్ట్ ప్రధాన పాత్రలు పోషించారు. అంతేకాదు స్టార్ నటి పూజ హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ లో రజినీతో స్టెప్పులేయనుంది. దీంతో ప్రేక్షకులలో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. 'కూలీ' ఈ ఏడాది మే 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ ఒకేసారి నాలుగు భాషల్లో ఒకేసారి  ఐదు భాషల్లో విడుదల కానుంది.

Also Read: DIL Raju: విజయ్ సినిమాపై నోరు జారిన దిల్ రాజ్.. వెంటనే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్

రూ. 40 కోట్లు.. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు హక్కుల కోసం అనేక ప్రధాన కంపెనీలు పోటీపడుతున్నాయి. అయితే ఆసియన్ సినిమాస్ సునీల్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ తెలుగు హక్కులను కొనేందుకు మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. రూ.40 కోట్లకు పైగా ఖర్చు చేసి 'కూలీ' కొనడానికి సిద్దమైనట్లు  సమాచారం. ఇటీవలే సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ రూ. 9 కోట్లతో సూర్య 'రెట్రో' సినిమా తెలుగు హక్కులను కొనుగోలు చేసింది. గతంలో  'లియో' హక్కులను కూడా ఈ సంస్థనే కొనుగోలు చేసింది. 

Also Read: Oscar Awards 2025: వేశ్యతో ప్రేమలో పడిన కథ.. 'అనోరా' చిత్రానికి ఏకంగా ఐదు కేటగిరీల్లో ఆస్కార్ అవార్డు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు