Rajendra Prasad: వార్నర్ నన్ను క్షమించు.. రాజేంద్ర ప్రసాద్ వీడియో వైరల్
డేవిడ్ వార్నర్ ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలుపై నటుడు రాజేంద్రప్రసాద్ స్పందించారు. ఉద్దేశపూర్వకంగా అనలేదని.. అనుకోకుండా ఆ మాట తన నోటి నుంచి దొర్లిందని తెలిపారు. ఏదేమైనా వార్నర్ అంటే తనకెంతో ఇష్టమని.. తన మాటలు ఎవరినైనా నొప్పిస్తే సారీ అని చెప్పారు.
Rajendra Prasad: నితిన్ లేటెస్ట్ మూవీ 'రాబిన్హుడ్' ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు రాజేంద్రప్రసాద్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ని ఉద్దేశిస్తూ చేసిన వాఖ్యలపై ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయ్యారు. సినిమాలో డేవిడ్ వార్నర్ పాత్ర గురించి మాట్లాడుతూ.. క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప స్టెప్స్ వేశాడు. 'దొంగ ము** కొడుకు.. మామూలోడు కాదండీ వీడు. రేయ్ వార్నరూ'' అని అన్నారు. ఇది రాజేంద్రప్రసాద్ సరదాగానే అన్నప్పటికీ.. ఫ్యాన్స్ మాత్రం అలా అనడమేంటి అంటూ మండిపడ్డారు.
క్షమించండి..
దీంతో తాజాగా ఈ వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ స్పందించారు. ''నేను వార్నర్ ఉద్దేశపూర్వకంగా అనలేదు. ఆ మాట అనుకోకుండా నా నోటి నుంచి దొర్లింది. ఏదేమైనా వార్నర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన క్రికెట్ అంటే కూడా చాలా ఇష్టం. నా మాటలు ఎవరినైనా నొప్పిస్తే క్షమించండి అని చెప్పారు.
వెంకీ కుడుములు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్లో నటించారు. ఇప్పటికే డేవిడ్ వార్నర్ లుక్ టీజర్ విడుదల చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. హెలికాప్టర్ నుంచి దిగుతూ.. లాలీపాప్ తింటూ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో సినిమాలో వార్నర్ పాత్ర ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించగా.. రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. ఇదిలా ఉంటే ఈమూవీ ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నితిన్ యాక్షన్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ సన్నివేశాలు అలరించాయి.
telugu-news | cinema-news | Actor Rajendraprasad | Robinhood Pre Release