/rtv/media/media_files/2025/04/15/ygCp4Xu0RwdhyhboWSvK.jpg)
Raj Tarun
Raj Tarun: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ గురించి చెప్పాలంటే, అతని స్టైల్ కొంచెం ప్రత్యేకమే. కేవలం సినిమా ప్రమోషనన్స్ టైమ్ లో మాత్రమే కనిపించి, తర్వాత పూర్తిగా మాయమవ్వడం అతని అలవాటుగా కనిపిస్తోంది. మూవీ రిలీజ్ టైమ్ లో తప్ప మిగతా రోజుల్లో ఏమాత్రం అప్‌డేట్స్ లేకుండా మాయమయిపోతుంటాడు.
Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని
అయితే ఇక్కడ విషయం ఏంటంటే, రాజ్ తరుణ్ లాగానే అతని సినిమాలు కూడా అంతే త్వరగా మాయమవుతాయి. ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాడో, టైటిల్ ఏంటి, ఎప్పుడు విడుదలవుతుందో ఇవేమి ఎవరికీ తేలేదు. సడన్ గా కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంటాడు.
‘పాంచ్ మినార్’ ప్రమోషన్స్..
అయితే ఈ సారి కూడా అదే జరిగింది, రాజ్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చాడు. ‘పాంచ్ మినార్’(Paanch Minar) అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. చిత్ర బృందం టీజర్‌ను లాంచ్ చేసింది. ఇకపై సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను వరుసగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విడుదల కూడా త్వరలోనే ఉండబోతుందట.
Also Read: ‘కేజీఎఫ్ చాప్టర్-2’: రాఖీ భాయ్ విధ్వంసానికి మూడేళ్లు!
ఇదంతా పక్కనపెడితే, గతంలో రాజ్ తరుణ్ పై వచ్చిన వ్యక్తిగత వివాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. లావణ్య అనే మహిళ రాజ్ తరుణ్ తన భర్త అని మీడియా ముందుకొచ్చి సంచలనం సృష్టించింది. ఆ వివాదం పెద్ద చర్చకు దారితీసినా, చివరికి ఆమెనే మళ్లీ అతనికి క్షమాపణలు చెప్పింది. తన ఆరోపణలకు తానే క్లారిటీ ఇవ్వడంతో, రాజ్ తరుణ్ తిరిగి తెరపైకి వస్తాడని అందరూ భావించారు.
Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..
అయితే ఆ వివాదం సద్దుమణిగాక కూడా రాజ్ తరుణ్ మాత్రం మౌనం వీడలేదు, కావాలనే అజ్ఞాతం లోకి వెళ్ళాడో, లేదంటే ప్లాన్డ్ సైలెన్స్‌లో ఉన్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇప్పుడు మరోసారి సినిమా విడుదల దశకు చేరుకోవడంతో మీడియా ముందుకొచ్చిన రాజ్ తరుణ్, సినిమా ప్రమోషన్స్ ముగిసిన తర్వాత మళ్లీ మాయమవుతాడా? అన్నది ప్రెశ్నగా మారింది.
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..