Raghavendra Rao: మెగా ఛాన్స్ పట్టేసిన భీమ్స్.. స్టేజ్ పై లీక్ చేసిన రాఘవేందర్ రావు

సంక్రాంతికి వస్తున్నాం' మ్యూజికల్ హిట్ కొట్టిన భీమ్స్ అనిల్ నెక్స్ట్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేశాడు. అనిల్- మెగాస్టార్ కాంబోలో రాబోతున్న సినిమాకు కూడా భీమ్స్ మ్యూజిక్ అందించబోతున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు రాఘవేందర్ రావు ఇటీవలే ఓ ఈవెంట్ లో బయటపెట్టారు.  

New Update

Raghavendra Rao: టాలీవుడ్ లో తమన్, దేవిశ్రీ వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల తర్వాత.. ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు భీమ్స్ సిసిరోలియో. సినిమా సినిమాకు తన మ్యూజిక్ లో వేరియేషన్ చూపిస్తూ ఆడియన్స్ లో బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు.  ఇటీవలే విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం'  సినిమాతో భీమ్స్ మరోసారి మారుమోగిపోయింది. 'గోదారి గట్టు మీద' , 'బ్లాక్ బస్టర్ పొంగలు', మీను సాంగ్ ఇలా సినిమాలోని ప్రతీ పాట ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి.  ఓవరాల్ గా ' సంక్రాంతికి వస్తున్నాం'  హిట్ లో హైలైట్ గా నిలిచింది. 

Also Read: Samantha: ఏదీ స్థిరంగా ఉండదు.. సమంత మరో సంచలన పోస్ట్! దాని గురించేనా?

అనిల్ నెక్స్ట్ సినిమాలో కూడా.. 

ఇది ఇలా ఉంటే..  అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాలో కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ కొట్టేశాడు భీమ్స్. ఇటీవలే  'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ విక్టరీ వేడుకల్లో దర్శకుడు రాఘవేందర్ రావు  ఈ విషయాన్ని బయటపెట్టారు. రాఘవేందర్ రావు మాట్లాడుతూ.. "భీమ్స్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. అంతేకాదు నెక్స్ట్ అనిల్ చిరంజీవితో చేయబోయే నెక్స్ట్ సినిమాకు కూడా  భీమ్స్ మ్యూజిక్ అందించబోతున్నట్లు  తెలిపారు". అలాగే చిరంజీవితో చేస్తున్న సినిమాకు  'సంక్రాంతి అల్లుడు' అంటూ పెట్టాలని సూచించారు. మొన్నటివరకు చిన్న  హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించిన భీమ్స్.. 'సంక్రాంతికి వస్తున్నాం'  సినిమాతో మెగాస్టార్ లాంటి స్టార్ హీరోల సినిమాలు చేసే స్థాయికి వెళ్లడం మామూలు విషయం కాదు. 

అతితక్కువ బడ్జెట్ తో రూపొందిన  'సంక్రాంతికి వస్తున్నాం' అత్యధిక వసూళ్లను సాధించింది. కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్ తో పూర్తయిన ఈ సినిమా దాదాపు రూ.300కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. ప్రాంతీయ భాషల్లో మాత్రమే రిలీజై రూ.300కోట్ల  మార్క్ దాటిన తొలి సినిమాగా రికార్డు సృష్టించింది. 

Also Read: Allu Aravind: బన్నీ డ్యాన్స్ చిరంజీవి నుంచి వచ్చింది కాదు.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు