Raashii Khanna: షూటింగ్ లో రాశీ ఖన్నాకు గాయాలు.. ముక్కు నుంచి రక్తం కారుతూ! ఫొటోలు వైరల్

నటి రాశీఖన్నా షూటింగ్ లో గాయపడ్డారు. ముక్కు నుంచి రక్తం కారుతూ.. చేతులకు మొహానికి గాయాలైన ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలను షేర్ చేస్తూ ఓ క్యాప్షన్ పెట్టారు.. 'కొన్ని రోల్స్ అడగవు.. డిమాండ్ చేస్తాయి. నీ శరీరం, శ్వాస, గాయాలను లెక్క చేయకూడదు అని పెట్టారు.

New Update

Raashii Khanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా షూటింగ్ లో గాయపడినట్లు తెలుస్తోంది. గాయాలకు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫొటోలకు రాశీ ఒక క్యాప్షన్ కూడా జోడించారు. ''కొన్ని పాత్రలు అడగవు.. డిమాండ్ చేస్తాయి. అప్పుడు మీ శ్వాస, మీ గాయాలను కూడా చేయకూడదు'' అని రాసుకొచ్చారు.  దీంతో రాశీ.. యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా గాయపడినట్లు అనుకుంటున్నారు. ఈ ఫొటోల్లో రాశీ మొహానికి, చేతులకు గాయాలు కనిపించాయి. అలాగే ముక్కు నుంచి రక్తం కారుతోంది. 

 'ఫర్జీ2' షూటింగ్

ప్రస్తుతం రాశీ  'ఫర్జీ2' షూటింగ్ లో పాల్గొంటోంది.  2023లో అమెజాన్ ప్రైమ్ రూపొందించిన ఈ సీరీస్ సీజన్ 1 సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు సీజన్ 2 కూడా ఇంట్రెస్టింగ్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది. సీజన్ 2 రాశీ యాక్షన్ సన్నివేశాల్లో కనిపించబోతున్నట్లు ఫొటోలు చూస్తే అర్థమవుతోంది. ఇందులో విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్, కాయ్ కాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫ్యామిలీ మెన్ సీరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే , సీతా ఆర్ మీనన్, సుమన్ కుమార్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. 

దీంతో పాటు రాశీ తమిళ్ లో అఘాతియా, తెలుగులో నీరాజకోన దర్శకత్వంలో 'తెలుసు కదాప్రధాని ' చిత్రాలు చేస్తోంది. తెలుసు కదా చిత్రంలో రాశీతో పాటు కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కూడా మరో ఫీమేల్ లీడ్ లో కనిపించనుంది. ఇదిలా ఉంటే రాశీ ఇటీవలే హిందీలో  'సబర్మతి రిపోర్ట్' సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. గోద్రా రైల్వే స్టేషన్ 'సబర్మతి ఎక్స్ ప్రెస్' ఫైర్ యాక్సిడెంట్ ఘటన  నేపథ్యంలో రూపొందిన చిత్రాన్ని ప్రధాని మోదీ సైతం ప్రశంసించారు. 
latest-news | cinema-news | telugu-news | raashi-khanna 

Also Read :  12 రోజుల తర్వాత వాఘా-అట్టారీ బోర్డర్ లో బీటింగ్ రిట్రీట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు