Pushpa 2 : పుష్ప ఫ్యాన్ కు పూనకాలే.. అప్డేట్ అదిరిపోయింది..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప2' సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించగా.. ఈ మూవీ రిలీజ్ కు ఇంకా 50రోజులే ఉందని మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ఒక పోస్టర్ విడుదల చేశారు.

pushpa 2,
New Update

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప2'. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఫస్ట్ పార్ట్ పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. దానికి అనుగుణంగానే దర్శకుడు ఈ సీక్వెల్ చిత్రాన్ని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇది కూడా చదవండిః మత్తు స్ప్రే చల్లి, న్యూడ్ వీడియోలు తీసి.. జాయ్‌ పై మరో కేసు నమోదు

మరో 50 రోజుల్లో

అయితే ఓ వైపు బన్నీ అభిమానులు పలు అప్డేట్ లతో ఫుల్ హ్యాపీగా ఉన్నా.. మరోవైపు సినిమా రిలీజ్ కి సంబంధించిన గాసిప్ లతో చాలా నిరాశ అవుతున్నారు. ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు తెలిపిన మేకర్స్.. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా వేశారు.

ఇది కూడా చదవండిః సీఎం చంద్రబాబుకు జగన్ షాక్!

ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ 6న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు.అయితే ఇది కూడా కష్టమని నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సారి తగ్గేది లేదన్నట్లే మేకర్స్ అప్డేట్ల మీద అప్డేట్లు ఇస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు.

ఇది కూడా చదవండిః పవన్‌ పేషీలోకి పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్.. కీలక బాధ్యతలు..!

ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 6న గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగానే ఈ సినిమా ఇంకా రిలీజ్ కు 50 రోజులు మాత్రమే ఉందని తెలుపుతూ ఓ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో అల్లు అర్జున్ స్టైల్ ఓ రేంజ్ లో ఉంది. కుర్చీపై కూర్చుని చూస్తున్న అతడి లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. 

Also Read :  మరోసారి కొండా సురేఖకు సమంత కౌటర్! ఏముందో తెలిస్తే షాకే

#tollywood #pushpa-2 #allu-arjun-pushpa-2
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe