BREAKING: సీఎం చంద్రబాబుకు జగన్ షాక్!

AP: కాకినాడ జిల్లాలో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. టీడీపీకి ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు రాజీనామా చేశారు. ఈరోజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు జగన్. 

New Update
jagana

Jagan: మాజీ సీఎం జగన్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడంతో  సొంత పార్టీ నేతలు రాజీనామాలు చేస్తున్న సమయంలో జగన్ చేరికల ప్రక్రియ మొదలు పెట్టారు. తాజాగా అధికార టీడీపీకి జగన్ షాక్ ఇచ్చారు. తాజాగా కాకినాడ జిల్లాలో టీడీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు రాజీనామా చేశారు. ఈరోజు మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు జగన్. 

ఇది కూడా చదవండి: విచారణకు రమ్మన్నారు.. సజ్జల అరెస్ట్ తప్పదా?

ఇది కూడా చదవండి: నేడు హర్యానాకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్

జగన్‌ వర్క్‌షాప్‌...

వైసీపీ ముఖ్య నేతలతో వైఎస్‌ జగన్‌ వర్క్‌షాప్‌ చేపట్టారు. తాడేపల్లి పార్టీ ఆఫీసులో సమావేశం అయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు జగన్. పార్టీ ఫిరాయింపులు ఆపేందుకు.. అలాగే టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ వారితో చర్చించనున్నారు. 

ఇది కూడా చదవండి:  మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. పోలీసుల అదుపులో అగ్రనేత సుజాత?

జనసేనలోకి వైసీపీ నేతలు!

మరికొంత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పలువురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వారి బాటలోనే నడిచేందుకు పలువురు కీలక నేతలు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో జగన్‌పై అసంతృప్తిగా ఉన్న నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అయితే వైసీపీ వారిని చేర్చుకునేందుకు టీడీపీ సుముఖంగా లేకపోవడంతో ఆ పార్టీ వారంతా జనసైన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జనసేనలో చేరిన బాలినేనితో పలువురు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో పలువురు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు కూడా చర్చ జరుగుతోంది. 

ఇది కూడా చదవండి: నేడు ఢిల్లీకి భట్టి విక్రమార్క.. అధిష్టానంతో కీలక భేటీ!

Advertisment
తాజా కథనాలు