పూరీకి హీరో దొరికేసాకాడోచ్.. ఈసారైనా హిట్ కొడతాడా? 'డబుల్ ఇస్మార్ట్' తో డిజాస్టర్ అందుకున్న పూరీ జగన్నాథ్.. తన నెక్స్ట్ మూవీని అక్కినేని నాగార్జునతో చేయనున్నట్లు తెలుస్తోంది.నాగ్ తో సినిమా కోసం పూరీ ట్రై చేస్తున్నారని, రీసెంట్ గానే వీరిద్దరూ కలిసి సినిమా గురించి చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. By Anil Kumar 05 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కు ప్రస్తుతం కాస్త కష్టకాలం నడుస్తుంది. 'లైగర్' అనుకుంటే.. మొన్నొచ్చిన 'డబుల్ ఇస్మార్ట్' దాన్ని మించిన డిజాస్టర్ అయింది. దాంతో పూరీ కెరీర్ డైలమాలో పడిపోయింది. ఈయన తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందా? అనే ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఏ హీరో ఆయన్ని నమ్ముతాడనే చర్చ మొదలైంది. నాగార్జునతో పూరీ సినిమా.. అయితే పూరీ చూపులు ఇప్పుడు అక్కినేని సీనియర్ హీరో నాగార్జున వైపు ఉన్నట్లు తెలుస్తుంది. నాగార్జునతో సినిమా కోసం పూరీ ట్రై చేస్తున్నారని తెలుస్తుంది. పూరితో నాగ్ కు ఎంతో మంచి బాండింగ్ ఉంది. గతంలో వీరి కాంబోలో సూపర్, శివమణి సినిమాలొచ్చాయి. వీటిలో 'సూపర్' సినిమా యావరేజ్‌గానే ఆడినా.. అందులో నాగార్జున లుక్ మాత్రం నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. Also Read : 'తండేల్' రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన.. చైతూ, సాయి పల్లవి ఎమోషనల్ పోస్టర్ ఆ సినిమాతో పదేళ్ళు నా వయసు తగ్గిందంటూ ఎన్నోసార్లు చెప్పారు నాగ్. 20 ఏళ్ళ కిందే హాలీవుడ్ మేకింగ్ ఈ సినిమాలో చూపించారు పూరీ. మరోవైపు నాగ్ కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా 'శివమణి' మాత్రం డిఫెరెంట్. అప్పటి వరకు ఉన్న ఆయన ఇమేజ్‌ను మార్చేసిన సినిమా ఇది. ' నా పేరు శివమణి.. నాకు కొంచెం మెంటల్..' అంటూ నాగ్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఫేమస్. నా సామిరంగ తర్వాత కుబేరా, కూలీ లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు నాగార్జున. హీరోగా కొత్త సినిమా ప్రకటించలేదు. దాంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం నాగ్‌ను ఒప్పించే పనిలో ఉన్నారట పూరీ జగన్నాథ్. ఈ కాంబో కలవాలని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగానే ఉన్నారు. మరి పూరీని నమ్మి నాగార్జున మరో ఆఫర్ ఇస్తారా లేదా అనేది చూడాలి. Also Read : వామ్మో.. 'కంగువా' అన్ని వేల స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందా? #director-puri-jagannadh #akkineni-nagarjuna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి