/rtv/media/media_files/2025/03/07/WqMVNHYhAc2cBTU0OsSO.jpg)
Pavithra Puri
Pavithra Puri: టాలీవుడ్ లో డైలాగ్స్ తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క పూరీ జగన్నాథ్ మాత్రమే, వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందారు పూరీ. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకి మంచి మాస్ మూవీ ఇచ్చి అందరిని మాస్ హీరోస్ గా నిలబెట్టాడు
అయితే, ఒక్కప్పటి పూరీ సినిమాల సంగతి అందరికి తెలిసిందే. కానీ ప్రస్తుతం పూరీకి బ్యాడ్ టైమ్ నడుస్తుందనే చెప్పాలి. ‘‘ఇస్మార్ట్ శంకర్’’ తరువాత ఆ రేంజ్ హిట్ కొట్టలేకపోయాడు పూరీ.
Also Read: ముంబైపై గుజరాతీల కుట్ర.. RSS నేతపై దేశద్రోహం కేసు: మాజీ సీఎం సంచలనం!
చైల్డ్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాల్లో
ఇది ఇలా ఉంటే, పూరీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తన పిల్లలిద్దరినీ ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. ప్రభాస్ నటించిన బుజ్జిగాడు మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్స్ గా పూరీ పిల్లలు నటించారు. పూరీ కొడుకు ఆకాష్ పూరీ ఇప్పుడు హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. కానీ ఒక సాలిడ్ సక్సెస్ మాత్రం ఇంతవరకు ఆకాష్ కి దక్కలేదు. అయితే, ఆయన కూతురు పవిత్ర కూడా సినిమాల్లో అడుగు పెట్టారు. పవిత్ర మొదటగా ‘‘బుజ్జిగాడు’’ సినిమాలో నటించి తెరపై కనిపించారు. తరువాత, పెద్దగా మూవీస్ లో కనిపించలేదు. పవిత్ర ఫస్ట్ లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాల్లో నటించినప్పటికీ, ‘‘బుజ్జిగాడు’’ తర్వాత మాత్రం పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.
అయితే, ఆకాష్ పూరీ సినిమా రంగంలో బిజీ అయితే, పవిత్ర మాత్రం సినిమా ఫీల్డ్ కు దూరంగా ఉంటూ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తన ఇంస్టా లో పోస్ట్స్ పెడుతూ కనిపిస్తుంటారు. తాజాగా, ఆమె గోశాలలో దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు, ఇవి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘‘బుజ్జిగాడు’’ సినిమాలో క్యూట్‌గా కనిపించిన పవిత్ర ఇప్పుడు కాస్త బొద్దుగా మారిపోయి కనిపిస్తోస్తున్నారు.
Also Read: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే