Akash Puri : పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ తనయుడు.. ఏకంగా ఆ పదాన్ని తొలగించి..!
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ పేరు మార్చుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఇకపై తన పేరు ఆకాశ్ పూరీ కాదని, ఆకాశ్ జగన్నాథ్ అని ప్రకటించారు. ఈమేరకు ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.