ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచే ఈ సినిమాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరేమో సినిమా సూపర్ డూపర్ హిట్ అంటుంటే.. మరికొందరేమో సినిమా అస్సలు బాగోలేదని చెప్పుకొచ్చారు. అలా మిక్సిడ్ టాక్‌ను దేవర అందుకుంది.
అయితే స్టార్ హీరో కాబట్టి సినిమాకి చిన్నపాటి పాజిటివ్ టాక్ వచ్చినా.. అది బ్లాక్ బస్టర్ అవుతుందని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. అలాంటి సమయంలో ఈ సినిమా కలెక్షన్ల గురించి చర్చలు మొదలయ్యాయి. కొందరేమో హిట్, మరికొందరేమో ఫ్లాపు అంటుంటే.. కలెక్షన్లు ఏ మాత్రం వచ్చి ఉంటాయో అని ఆలోచిస్తున్నారు. అయితే వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రానికి తొలి రోజే రూ.173 కోట్లు కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ ఇటీవల అఫీషియల్‌గా ప్రకటించింది. దీంతో ఈ కలెక్షన్స్ విషయంలో పలు అనుమానాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ఒకటే చర్చ. దేవరకి తక్కువ కలెక్షన్స్ వచ్చినా.. దాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నారని ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ మాట. దాన్ని హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.
నిర్మాత నాగవంశీ క్లారిటీ
తాజాగా దీనిపై నిర్మాత నాగవంశీ స్పందించాడు. లక్కీ భాస్కర్ మూవీ ప్రెస్ మీట్‌లో దేవర కలెక్షన్స్ గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా నాగవంశీ మాట్లాడుతూ.. దేవర సినిమా ఎంత మేర కలెక్షన్స్ సాధించిందో అంత మేరకు రిపోర్ట్ చేశానని తెలిపాడు. ఒకవేళ అంత కలెక్షన్స్ వచ్చాయని మీడియా నమ్మకపోతే తన తప్పేంటని అన్నట్లు మాట్లాడాడు.
అయితే ఈ కలెక్షన్స్ రిపోర్ట్ విడుదల చేయడం కేవలం ఫ్యాన్స్ కోసం మాత్రమే అని.. వాళ్లలో ఉత్సాహాన్ని నింపడం కోసమేనని అన్నాడు. అయితే మరి నాగవంశీ కరెక్ట్‌గానే చెప్పాడు కదా.. అందులో ఫేక్ కలెక్షన్స్ ఎక్కడా ప్రస్తావించలేదు కదా అనే డౌట్ రావచ్చు. నాగవంశీ కరెక్ట్‌గానే మాట్లాడాడు. నిజాయితీగానే కలెక్షన్స్ రిపోర్ట్ రిలీజ్ చేశామని చెప్పాడు. అయితే ఆయన మాటలను ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్‌గా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఫేక్ ప్రచారం
డిస్ట్రిబ్యూటర్ ఇంత డైరెక్ట్‌గా కలెక్షన్స్ ఫేక్ అని చెప్పినా.. ఇంకా సినిమా హిట్ అని ఎలా అనుకుంటున్నారని నెట్టింట టాక్ మొదలుపెట్టారు. అంతేకాకుండా కలెక్షన్స్ రిపోర్ట్ కేవలం అభిమానుల ఆనందం కోసమే అని చెప్పడంతో వాటిని ఫేక్ చేసి రిలీజ్ చేస్తున్నామని అర్థం వచ్చేలా ప్రచారం చేస్తున్నారు. ఇలా ప్రతి విషయాన్ని యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్‌గా ప్రచారం చేసి దేవర సినిమాకు, ఎన్టీఆర్‌కు షాక్ ఇస్తున్నారు. ఏది ఏమైనా నాగవంశీ మాట్లాడిన దాంట్లో ఎలాంటి కాంట్రవర్సీ లేదు. ఇక ఈ సినిమా 16 రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిపోయినట్లు మేకర్స్ రీసెంట్‌గా పోస్టర్ రిలీజ్ చేశారు.