ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన నిర్మాత.. కారణం ఇదే!

నిర్మాత నాగ వంశీ.. 'దేవర' సక్సెస్ మీట్ క్యాన్సిల్ అయిందని పోస్ట్ పెట్టాడు. ఈ ఈవెంట్‌ను భారీగా నిర్వహించాలని అనుకున్నప్పటికీ అనుమతులు లభించలేదని తెలిపారు. సక్సెస్‌ మీట్‌ను నిర్వహించలేకపోతున్నందుకు అభిమానులను క్షమాపణలు కోరారు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

naga vamsi
New Update

జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ లో నటించిన 'దేవర' ఇటీవల థియేటర్స్ లో రిలీజై మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయగా.. అన్ని చోట్ల సినిమాకి భారీ ఆదరణ దక్కింది. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రూ.396 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 

అయితే సినిమా రిలీజ్ కు ముందు మూవీ టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయగా.. అనివార్య కారణాల వల్ల అది క్యాన్సిల్ అయింది. దాంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. కానీ కొరటాల శివ మాత్రం రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తామని చెప్పారు. దాంతో ఈ సక్సెస్ మీట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగ వంశీ 'దేవర' సక్సెస్ మీట్ క్యాన్సిల్ అయిందని షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ఈ మేరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సారీ కూడా చెప్పాడు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్షమించండి..

" 'దేవర ని' ఈ స్థాయిలో ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంలో సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించలేకపోవడంతో విజయోత్సవ వేడుకనైనా ఘనంగా చేయాలని ఎన్టీఆర్‌ ఎంతో భావించారు. మేము ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ దసరా, దేవీ నవరాత్రి ఉత్సవాలు ఉన్న కారణంగా మా వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ వేదికలకు అనుమతులు పొందలేకపోయాం. 

ఈ పరిస్థితి మా నియంత్రణలో లేదు. ఈ ఈవెంట్‌ను నిర్వహించలేకపోతున్నందుకు అభిమానులను క్షమాపణలు కోరుతున్నాం. వేదిక అనుమతి కోసం మేము ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాం. మీ ప్రేమతో ఎన్టీఆర్‌ మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నా" అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక ఈ పోస్ట్ చూసిన తారక్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

Also Read :  తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్ లోనే..

#devara #ntr #producer-naga-vamsi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe