/rtv/media/media_files/ucZXbdw7yLVzTLPzF1Hr.jpg)
తమిళ స్టార్ హీరో జయం రవి ఇటీవలే తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. పెళ్లయిన 15 ఏళ్ల తర్వాత తాము ఒకరినొకరు అర్థం చేసుకొని విడిపోతున్నట్టు జయం రవి సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. అయితే అతని భార్య మాత్రం తనకు తెలియకుండానే జయం రవి విడాకులు ప్రకటించినట్లు ఆర్తి ఆరోపిస్తూ నోట్ రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.
అయితే జయం రవి బెంగళూరుకు చెందిన గాయని కెనిషా ఫ్రాన్సిస్‌తో డేటింగ్ చేస్తున్నాడని కోలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగింది. దీనిపై ఇప్పటికే జయం రవి స్పందించాడు. అవన్నీపుకార్లు మాత్రమేనని, గాయనిని ఇందులోకి లాగొద్దని కోరాడు. తాను అన్ని ఆధారాలతో కోర్టులో పరిష్కారం కోరుతున్నానని అన్నారు. ఇలాంటి టైం లో జయం రవి మరో హీరోయిన్ తో ఉన్న ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు మలయాళ బ్యూటీ ప్రియాంక మోహన్.
#jayamravi 💞💞💞 #PriyankaMohan
— புல்லட் வண்டி (@bullet_vandi) October 3, 2024
Reel ah irundhalum jodi nalla iruku😍#Brother pic.twitter.com/Ofm0iEhYAS
#brother #jayamravi #PriyankaMohan 📸 pic.twitter.com/doeaayEcWU
— Abinesh (@Abinesh0517) October 2, 2024
Let's Celebrate this Diwali 💥 with @actor_jayamravi 's #Brother movie.
— Screen Scene (@Screensceneoffl) August 3, 2024
💯 𝗙𝗮𝗺𝗶𝗹𝘆 𝗘𝗻𝘁𝗲𝗿𝘁𝗮𝗶𝗻𝗲𝗿 #BrotherFromDiwali 🧨@rajeshmdirector @Jharrisjayaraj @priyankaamohan pic.twitter.com/wvyVIAeUXq
నిజంగానే పెళ్లి చేసుకున్నారా?
ప్రియాంక మోహన్, జయం రవి ఇద్దరి మేడలో పూల దండాలు పెట్టుకోవడం, అలాగే పెళ్లి దుస్తులు ధరించడంతో... ప్రియాంక మోహన్ ను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, వీరిద్దరూ కలిసి ఉన్నఈ ఫోటోస్.. నిజ జీవితంలో పెళ్లి చేసుకోలేదని.. వారు తమ నుంచి రాబోయే నెక్స్ట్ మూవీ 'బ్రదర్'లో వచ్చే పెళ్లి సీన్ అని కోలీవుడ్ సినీ వర్గాలు తెలిపాయి.
Also Read : బ్రహ్మజీని 'లం** కొడకా' అని తిట్టిన కొండా సురేఖ ఫ్యాన్.. రిప్లై ఇచ్చిన నటుడు
కాగా ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన బ్రదర్ సినిమాలోని పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక 'బ్రదర్' సినిమా విషయానికొస్తే.. ఇందులో జయం రవి, ప్రియాంక మోహన్ జంటగా నటిస్తున్నారు. ఎం రాజేష్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.