/rtv/media/media_files/ARZrJZkTJcZ9YRYgDDW6.jpg)
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన విలక్షణ నటనతో విలన్ గా మంచి పేరుతెచ్చుకున్నాడు. అటు కమెడియన్ గానూ మెప్పించాడు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో విలన్, కమెడియన్ రోల్స్ లో నటిస్తున్నాడు. అయితే బ్రహ్మాజీ.. సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటారు.
ఇండస్ట్రీలో ఏదైనా వివాదం చెలరేగినా లేదా తనపై ఎవరన్నా ట్రోల్ చేస్తే అప్పుడు రియాక్ట్ అవుతుంటాడు. సోషల్ మీడియాలోనే తనను ట్రోల్ చేసిన వాళ్లకు ధీటుగా రిప్లైలు ఇస్తుంటాడు. తాజాగా ఓ నెటిజన్ బ్రహ్మజీని తిడుతూ ఓ పోస్ట్ పెట్టాడు. దానికి బ్రహ్మాజీ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే..
నాగ చైతన్య, సమంత విడాకుల గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యాలపై సురేఖ మరోసారి మాట్లాడుతూ..'నేను వాస్తవాలు మాత్రమే మాట్లాడతాను. ఇప్పటివరకు సమంత నాగచైతన్య ఎందుకు విడిపోయారో ఎందుకు చెప్పట్లేదు? నాకు ఇండస్ట్రీ నుండి సమాచారం ఉంది కాబట్టే నేను మాట్లాడాను..' అని చెప్పింది.
Ey ra lanja kodaka
— 🥛.. (@BillaKadapa) October 4, 2024
Nannu .. maa Amma ni thittalante mee OWN DP petti thittandi.. maa prabhas Devudu.. Aayana DP petti nannu thidithe valla fans feel avutharu.. sare Mee Amma garini adiganani Cheppandi Sir 🙏🏼 https://t.co/JhTXt1vmft
— Brahmaji (@actorbrahmaji) October 4, 2024
అందుకు సంబంధించిన వీడియోను నటుడు బ్రహ్మాజీ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..'ఎందుకు విడిపోయారో మీకు చెప్పాలా … మంత్రి గారు' అని కౌంటర్ ఇచ్చాడు. అయితే బ్రహ్మాజీ పెట్టిన పోస్ట్ కు ఓ నెటిజన్.. బ్రహ్మజీని 'లం** కొడకా' అని తిడుతూ కామెంట్ పెట్టాడు. అయితే సదరు నెటిజన్ ఎక్స్ అకౌంట్ ప్రభాస్ డీపీతో ఉంది.
స్వంత డీపీ పెట్టి తిట్టండి..
దాంతో బ్రహ్మాజీ ఆ నెటిజన్ కు ఇలా రిప్లై ఇచ్చాడు.' నన్ను .. మా అమ్మ ని తిట్టాలంటే మీ స్వంత డీపీ పెట్టి తిట్టండి.. మా ప్రభాస్ దేవుడు.. ఆయన డీపీ పెట్టి నన్ను తిడితే వాళ్ల ఫ్యాన్స్ ఫీల్ అవుతారు.. సరే మీ అమ్మ గారిని అడిగినా అని చెప్పండి సార్..' అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నాడు. దీంతో బ్రహ్మాజీ పెట్టిన ఈ పోస్ట్ చూసి 'వాడికి సరైన బుద్ధి చెప్పారు' అంటూ బ్రహ్మజీని సపోర్ట్ చేస్తూ రిప్లై ఇస్తున్నారు.