Priyanka Chopra భర్తకు ప్రమాదం..? షో మధ్యలోనే పారిపోయిన నిక్!

ప్రియాంక చోప్రా భర్త ..నిక్ జొనాస్‌కు అనుకోని సమస్య ఎదురైంది. ప్రేగ్‌లో కాన్సర్ట్ చేస్తున్న సమయంలో ఆయన పై గుర్తు తెలియని వ్యక్తి లేజర్ లైట్ వేశాడు. ఇది గమనించిన నిక్ షో మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో నిక్‌కు ఏదైనా డేంజర్‌ ఉందా? అని అనుకుంటుంటున్నారు.

nick jonas

nick jonas

New Update

Nick Jonas :  జోనాస్ బ్రదర్స్, నిక్ జోనాస్, కెవిన్ జోనాస్,  జో జోనాస్‌లు తమ  ప్రపంచ పర్యటనలో భాగంగా మంగళవారం ప్రేగ్‌లో మ్యూజికల్  ప్రదర్శన ఇచ్చారు. ఈ క్రమంలో నిక్ వేదికపై నుంచి పారిపోతున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అసలు నిక్ షో మధ్యలో నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు? ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం.. 

Also Read: బ్రాను అలా ధరిస్తే క్యాన్సర్ ముప్పు.. పరిశోధనలో షాకింగ్ విషయాలు!

నిక్ జోనస్ కు ప్రమాదమా? 

అయితే నిక్ ప్రేగ్‌లో కాన్సర్ట్ చేస్తున్న సమయంలో ఆయన పై గుర్తు తెలియని వ్యక్తి లేజర్ లైట్ వేసి ఫోకస్ చేశాడు. ఇది గమనించిన నిక్ షోను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. దీంతో నిక్‌కు ఏదైనా డేంజర్‌ ఉందా? అని నెట్టింట అనుకుంటుంటున్నారు.  నిక్ స్టేజ్ దిగి వెళ్ళిపోయినప్పుడు అతని బ్రదర్స్ కెవిన్ జోనాస్,  జో జోనాస్ వేదికపైనే ఉన్నారు. ఈ సంఘటన తర్వాత కొంత సమయం వరకు నిక్ బ్రదర్స్ షోను నిలిపి వేశారు. నిక్ పై లైట్ వేసిన వ్యక్తిని వేదిక నుంచి తొలగించినట్లు తర్వాత షోని మళ్ళీ ప్రారంభిచినట్లు సమాచారం. షో మధ్యలో ఆగిపోవడంతో నిక్ ఫ్యాన్స్ కాస్త ఆందోళనకు గురయ్యారు. నిక్ జోనాస్ 2018లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ మాల్టీ అనే కూతురు ఉంది. 

నిక్ పూర్తి పేరు నికోలస్ జెర్రీ జోనాస్. అమెరికన్ సింగర్, లిరిసిస్ట్,  నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జోనాస్ ఏడు సంవత్సరాల వయస్సు నుంచి  బ్రాడ్‌వేలో నటించడం ప్రారంభించాడు. నిక్ తన ఫస్ట్ ఆల్బమ్ ను 2002లో   విడుదల చేశాడు. 

Also Read:  35 ఏళ్ళ టీవీలో షారుక్ సీరియల్ సీక్వెల్.. కానీ షారుక్ ఖాన్ స్థానంలో ఎవరంటే?

Also Read: 'దేవర' సక్సెస్ పై ఎన్టీఆర్ ఎమోషనల్.. వైరలవుతున్న పోస్ట్

Also Read:  PCOS మహిళల్లో ఆ సమస్య ఉంటే మరింత ప్రమాదమా!

#bollywood #nick-jonas #priyanka-chopra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe