పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్

పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాష్‌రాజ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉదయ నిధిపై ప్రశంసలు కురిపిస్తూ.. ఓ డిప్యూటీ సీఎం సనాతనం గురించి మాట్లాడుతున్నారు. మన డిప్యూటీ సీఎం సమానత్వం గురించి మాట్లాడుతున్నారు అని అన్నారు.

New Update
pawan kalyan,

Prakash Raj Vs Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు ప్రకాష్ రాజ్ మధ్య కామెంట్ల యుద్ధం కొనసాగుతోంది. తిరుమల లడ్డూ విషయంలో సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ మండి పడ్డాడు. అప్పటి నుంచి వరుస ట్వీట్‌లతో పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి పరోక్షంగా పవన్ కళ్యాణ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. 

మనకు సమానత్వమే ముఖ్యం

చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్, పవన్‌ను ఉద్ధేశించి ఆసక్తికర విషయాలు చేశాడు. ఇందులో భాగంగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయ నిధిపై ప్రశంసలు కురిపిస్తూ పవన్‌పై విమర్శలు గుప్పించారు. ఓ డిప్యూటీ సీఎం సనాతనం గురించి మాట్లాడుతున్నారు. మన డిప్యూటీ సీఎం సమానత్వం గురించి మాట్లాడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు. అయితే మనకు సమానత్వమే ముఖ్యం అని అన్నాడు.

ఇది కూడా చదవండి: గాంధీ జయంతి రోజున కూడా పవన్ ను వదలని ప్రకాష్ రాజ్.. ట్వీట్ వైరల్

ఈ మేరకు విత్ డిప్యూటీ సీఎం పేరుతో జస్ట్ ఆస్కింగ్ అనే క్యాప్షన్‌తో ఉదయనిధి స్టాలిన్‌తో దిగిన ఒక ఫొటోను తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ పోస్ట్‌పై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఏం చెప్పాలనుకుంటున్నావో మ్యాటర్ చెప్పకుండా జస్ట్ ఆస్కింగ్ అంటే నీ పిచ్చి పీక్స్‌కు చేరుకుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా గతంలో సనాతనధర్మంపై ఉదయనిధి చేసిన కామెంట్స్‌పై ఇటీవల పవన్‌ కళ్యాణ్ మండిపడిన విషయం అందరికీ తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు