/rtv/media/media_files/2025/10/23/prabhas-lineup-2025-10-23-09-13-45.jpg)
Prabhas Lineup
Prabhas Lineup: ప్రస్తుతం భారత సినిమా ప్రపంచంలో బిగ్గెస్ట్ స్టార్ ఎవరు అని అడిగితే వెంటనే గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఈరోజు డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు(Prabhas Birthday) సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. “బాహుబలి”తో(Baahubali) దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్(Rebel Star), ఇప్పుడు ప్రతి సినిమాతో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. భారీ బడ్జెట్ సినిమాలు, అంతర్జాతీయ స్థాయి మేకింగ్, పాన్ ఇండియా రిలీజ్‌లతో ప్రభాస్ కెరీర్ దూసుకెళ్తోంది. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న సినిమాల లైన్‌అప్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! ప్రస్తుతం ప్రభాస్ దగ్గర ఏకంగా 7 సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు మరో రెండు ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయట.
1. ది రాజాసాబ్(Raja Saab) - లవ్ హారర్ కామెడీ
మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో చాలా కొత్తగా ఉండనుంది. యాక్షన్ రోల్స్‌కి పేరున్న ప్రభాస్ ఈసారి హారర్ కామెడీ జానర్‌లో కనిపించబోతున్నాడు. షూటింగ్ తుది దశలో ఉంది. ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్‌ను 100 రోజుల ముందే విడుదల చేయడంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
2. ఫౌజీ(Fauzi) - వార్ డ్రామాలో ప్రభాస్
“సీతా రామం”తో క్లాస్ ఫీల్ ఇచ్చిన హను రాఘవపూడి, ఇప్పుడు ప్రభాస్‌తో కలసి ఓ పీరియడ్ వార్ డ్రామా చేస్తున్నారు. 1940ల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్ ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సుమారు రూ.600 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 2026లో విడుదల కానుంది.
3. స్పిరిట్(Spirit) - సాందీప్ వంగా దర్శకత్వంలో పోలీస్ యాక్షన్ మూవీ
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన సందీప్ వంగా ఇప్పుడు ప్రభాస్‌తో “స్పిరిట్” అనే భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఇది పాన్-ఇండియా మాత్రమే కాకుండా పాన్-వరల్డ్ స్థాయిలో రూపొందనుంది. నవంబర్‌లో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో “ఇప్పటి వరకు చూడని ప్రభాస్” కనిపించబోతున్నాడట.
4. కల్కి 2898 AD పార్ట్ 2 (Kalki 2)- సీక్వెల్‌పై భారీ అంచనాలు
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన “కల్కి 2898 AD” భారీ విజయాన్ని సాధించింది. దాని సీక్వెల్‌పై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. దీపికా పదుకొణె సినిమా నుండి తప్పుకోవడంతో, కొత్త హీరోయిన్ కోసం టీమ్ చూస్తోంది. స్క్రిప్ట్ సిద్ధంగా ఉండగా, త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈసారి రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి స్పెషల్ అపియరెన్సెస్ ఉండబోతున్నాయని టాక్.
5. సలార్ పార్ట్ 2 (Salaar 2)
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన “సలార్ పార్ట్ 1” మాస్ ఆడియన్స్‌లో సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో “డ్రాగన్” చేస్తున్నాడు. అది పూర్తయిన తర్వాతే సలార్ పార్ట్ 2 ప్రారంభం కానుంది. ఈసారి కథ మరింత యాక్షన్ థ్రిల్లింగ్‌గా ఉంటుందని సమాచారం.
6. మైత్రీ మూవీ మేకర్స్‌తో కొత్త సినిమా
ప్రభాస్ తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పాడట. దర్శకుడి పేరు ఇంకా బయటకు రాలేదు కానీ, ఇది ఓ కామర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్ ఉండొచ్చని టాక్.
7. చర్చల్లో ఉన్న రెండు సినిమాలు
లోకేష్ కనగరాజ్ (లియో, విక్రమ్ ఫేమ్), ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మతో కూడా ప్రభాస్ సినిమా చర్చల్లో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు ఫైనల్ అయితే ప్రభాస్ లైన్‌అప్ 2030 వరకు బిజీగా ఉండనుంది.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న అన్ని ప్రాజెక్టుల బడ్జెట్ కలిపితే దాదాపు ₹3500 కోట్లకు పైగా అవుతోంది. ఇంత భారీ లైన్‌అప్‌తో ఉన్న హీరో భారతీయ సినిమా చరిత్రలో ఇదే తొలిసారి. రోజుకు 14 గంటల వరకు షూటింగ్ చేస్తూ, రెండు సినిమాలకు ఒకేసారి డేట్స్ సర్దుబాటు చేసే ప్రభాస్ డెడికేషన్‌కి నిర్మాతలు కూడా ఫిదా అవుతున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం భారత సినిమాలలో మోస్ట్ బిజీ అండ్ హయ్యెస్ట్ పేడ్ స్టార్. “బాహుబలి” తర్వాత కూడా ఆయన క్రేజ్ ఇంకా పెరిగింది. 7 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ లైన్‌అప్ చూస్తే, ఆయన ఫ్యాన్స్‌కి వచ్చే కొన్ని సంవత్సరాలు నిజంగా ఒక ఫెస్టివల్ లాంటివే!
Follow Us