Raja Saab Trailer: రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా కాలం తర్వాత హారర్ కామెడీ జానర్ చేస్తుండడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. డైరెక్టర్ మారుతి- ప్రభాస్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రం హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రభాస్ వింటేజ్ వైబ్స్ తో అదరగొట్టింది. బుజ్జిగాడు, యోగి సినిమాల్లో చూసిన ప్రభాస్ ని గుర్తుచేసింది. టీజర్ లో ప్రభాస్ కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్, స్టైలింగ్ అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి.
ట్రైలర్ అప్డేట్
అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రాజాసాబ్' ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. రేపు సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో కొత్త పోస్టర్ షేర్ చేశారు. ''భయం ద్వారాలు తెరుచుకుంటున్నాయి... దైర్యం ఉంటే ప్రవేశించండి'' అంటూ ట్రైలర్ పై మరింత ఆసక్తిని పెంచారు. ఏకంగా 3 నిమిషాల 30 నిడివితో ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే రాజా సాబ్ గ్లిమ్ప్స్ వీడియోనే 2 నిమిషాలపై నిడివితో రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో దీనికి ముఞ్చి ట్రైలర్ ఉండబోతుందని నెట్టింట టాక్ నడుస్తోంది. ఇది నిజమైతే డార్లింగ్ ఫ్యాన్స్ కి పండగనే చెప్పొచ్చు!
The GATES of FEAR are opening…
— The RajaSaab (@rajasaabmovie) September 28, 2025
Enter if you dare 😎#TheRajaSaabTRAILER on SEP 29th, 6PM 💥💥#TheRajaSaab#Prabhaspic.twitter.com/8wuQO2Webl
రెండుట్రైలర్స్
సినిమా విడుదల వచ్చే ఏడాది ఉండడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ తగ్గకుండా రెండు ట్రైలర్లు ప్లాన్ చేశారు మేకర్స్. ఒకటి రేపు విడుదల చేస్తుండగా.. రెండో ట్రైలర్ ను రిలీజ్ సమయంలో విడుదల చేయనున్నారు. దీనివల్ల సినిమాకు మంచి హైప్ క్రియేట్ అవుతుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇందులో ప్రభాస్ జోడీగా మల్విక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ లో ప్రభాస్ - మాళవిక కెమిస్ట్రీ, ప్రభాస్- నిధి ట్రాక్ ప్రేక్షలను అలరించింది. గత సినిమాల్లో ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించిన ప్రభాస్.. రాజాసాబ్ లో ఫుల్ రొమాంటిక్ అండ్ కామెడీ యాంగిల్ లో కనిపించబోతున్నాడు.
ఈ సినిమతో పాటు ప్రభాస్ మరో మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ పార్ట్ 2, నాగి డైరెక్షన్ లో కల్కి 2898AD పార్ట్ 2, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాలు చేస్తున్నారు. ఈ మూడు చిత్రాలు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్, ఇంకా షూటింగ్ దశలో ఉన్నాయి.
Also Read: Mohan Babu: 'నాని'ని ఢీ కొట్టే శికంజా మాలిక్.. ‘ది ప్యారడైస్’ నుంచి మోహన్ బాబు ఫస్ట్ లుక్ అదుర్స్..