Prabhas Spirit: అనౌన్స్ చేసి 4 ఏళ్ళు అయింది.. ‘స్పిరిట్’ ఉన్నట్టా.. లేనట్టా..?

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న 'స్పిరిట్' నాలుగేళ్ల క్రితమే అనౌన్స్ అయినా ఇప్పటికీ షూటింగ్ మొదలుకాలేదు. ఇందులో తృప్తి డిమ్రి హీరోయిన్‌గా ఫిక్స్ కాగా, ప్రభాస్ పోలీస్‌గా కనిపించనున్నాడు. సినిమా విడుదలకు ఇంకా రెండు సంవత్సరాలు పట్టే అవకాశముంది.

New Update
Prabhas Spirit

Prabhas Spirit

Prabhas Spirit: ఇండియన్ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాల్ని క్రియేట్ చేసిన ప్రాజెక్ట్‌లలో ఒకటి ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందబోయే ‘స్పిరిట్’. అయితే ఈ సినిమా ఇప్పటివరకు సెట్స్ మీదకి కూడా వెళ్లకపోవడం అభిమానుల్లో నిరాశకు గురి చేస్తోంది.

Also Read: పవర్ స్టార్ 'ఓజీ' కలెక్షన్ల సునామీ.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!

నాలుగు ఏళ్లుగా ఎదురు చూపులు..

సందీప్ రెడ్డి వంగా ఈ ప్రాజెక్ట్‌ను మొదట 2021 అక్టోబర్ 8న సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుండి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పటి వరకూ షూటింగ్ మొదలుకాకపోవడం విశేషం. ఆ మధ్య షూటింగ్ 2024 సెప్టెంబరులో ప్రారంభమవుతుందనుకున్నారు, కానీ అది జరగలేదు.

Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..

సందీప్ వంగా చివరిగా డైరెక్ట్ చేసిన ‘యానిమల్’ 2023 డిసెంబరులో విడుదలై మంచి హిట్ అయింది. అప్పటి నుండి దాదాపు రెండు సంవత్సరాలు గడిచినా, ‘స్పిరిట్’ షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. ప్రభాస్ ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టుల్ని కంప్లీట్ చేసిన తర్వాతే షూటింగ్‌ స్టార్ట్ చేయనున్నారు. ఒకసారి షూటింగ్ మొదలైతే, ఈ సినిమా పూర్తవడానికి ఒకటి నుంచి ఒకున్నరేళ్లు పడే అవకాశం ఉంది. దాంతో, ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు కనీసం మరో రెండు సంవత్సరాలు వేచి ఉండాల్సిందే.

Also Read: పవన్ సినిమాలో విలన్‌గా మల్లా రెడ్డి.. ట్విస్ట్ ఏంటంటే..?

తరచూ వార్తల్లో నిలుస్తున్న 'స్పిరిట్'

ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే, ఈ సినిమా చర్చల్లో నిలుస్తోంది. మొదట, కొరియన్ యాక్టర్ డాంగ్ లీ విలన్‌గా నటించనున్నారనే వార్త వైరల్ అయింది. తరువాత దీపికా పదుకోన్ హీరోయిన్‌గా ఎంపికై, వ్యక్తిగత కారణాలతో ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆమెపై సందీప్ వంగా నేరుగా స్పందిస్తూ, నెగటివ్ పీఆర్ చేస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా ఫైనల్ అయ్యారు.

Also Read: సోషల్ మీడియా నెగెటివిటీపై రవి తేజ వైరల్ కామెంట్స్!

ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆ పాత్ర కోసం ఆయన శరీరం తగ్గిస్తూ స్లిమ్ లుక్‌లోకి మారుతున్నారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ తండ్రిగా, సంజయ్ దత్, హీరో తరుణ్ రీ ఎంట్రీ ఇస్తున్నారనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఏదీ అధికారికంగా ప్రకటించలేదు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంగీతాన్ని హర్షవర్ధన్ రమేశ్వర్ అందిస్తున్నారు.

ఈ రేంజ్‌లో ఉన్న ప్రాజెక్ట్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఇంకా సినిమా ప్రారంభం కాకపోవడం చూసి, "స్పిరిట్" పేరుకు తగ్గట్లుగా, ప్రస్తుతం ఇది కేవలం స్పిరిట్ గానే మిగిలిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

Advertisment
తాజా కథనాలు