/rtv/media/media_files/2025/03/16/EkEGDCfaswleyeKuU1Uh.jpg)
Salaar Re- Release Bookings
Salaar Re- Release: రెబెల్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రశాంత్ నీల్(Prashanth Neel) కంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'సలార్' గ్రాండ్ రీ-రిలీజ్ కు సిద్ధమైంది. వచ్చే శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమాకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మరో 5 రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్నాడు సలార్. డిసెంబర్ 2023లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఇప్పుడు రీ రిలీజ్ లో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతింది అని ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!
హౌస్ ఫుల్ బుకింగ్స్...
మార్చ్ 13 గురువారం ఉదయం 11 గంటలకు సలార్ ప్రీ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్, వైజాగ్‌లలోప్రీ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. దాదాపు అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ బుకింగ్స్ అవుతున్నాయి. బుకింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డైనే కేవలం 65 షోలకు గాను 27,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి, వాటిలో దాదాపు 22 షోలు హౌస్ ఫుల్. సలార్ ప్రీ-సేల్స్ నుండి ఇప్పటికే ఒక్కరోజు లోనే రూ. 33.50 లక్షలు రావడం విశేషం.
Also Read: DIL Raju: విజయ్ సినిమాపై నోరు జారిన దిల్ రాజ్.. వెంటనే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్
ఫస్ట్ రిలీజ్ లోనే సలార్ ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు సాదించి సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే OTT ప్లాట్‌ఫామ్‌లో 1 ఇయర్ పాటు సలార్ ట్రెండింగ్లోనే ఉంది రికార్డు సృష్టించింది.
Also Read: Court Movie: కంటెంట్ ముఖ్యం బిగులు.. పావురాలు ఎగరేస్తూ 'కోర్ట్' టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్!
అయితే, సలార్ రీ రిలీజ్ లో మరిన్ని రికార్డులు కొల్లగొడుతూ సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ లో ఉన్నారు.
Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి