RajaSaab Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. రాజాసాబ్ రిలీజ్ డేట్ ఇదే!

ప్రభాస్- డైరెక్టర్ మారుతీ కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఎక్స్ లో పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update

RajaSaab Release Date:  ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ది రాజా సాబ్' మూవీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 5న విడుదల కానున్నట్లు తెలియజేస్తూ ఎక్స్ లో పోస్టర్ షేర్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. ఇది మాత్రమే కాదు ఈనెల 16న మూవీ టీజర్ ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కామెడీ హర్రర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. ఈ సినిమాతో డార్లింగ్ మొదటి సారి హారర్ జానర్ లోకి అడుగుపెడుతున్నారు. అంతేకాదు ఇది ప్రభాస్ కెరీర్‌లో పూర్తిస్థాయి హారర్ ఎంటర్‌టైనర్‌గా నిలవనుంది. 

నయన్ స్పెషల్ అప్పియరెన్స్ 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో  నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.  'కల్కి 2898 AD' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న  'ది రాజా సాబ్'పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఒక స్పెషల్ అప్పియరెన్స్ సాంగ్‌లో మెరవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉన్నతమైన నిర్మాణ విలువలతో భారీ స్థాయిలో ఈ మూవీని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం దాదాపు  ₹300–350 కోట్లుగా ఖర్చు చేస్తున్నట్లు టాక్. 

Also Read: Telusu Kada: ఇద్దరు హీరోయిన్లతో సిద్ధూ వీడియో కాల్ వైరల్.. అసలు మ్యాటర్ తెలిసిపోయింది!

Advertisment
తాజా కథనాలు