RajaSaab: హైదరాబాద్ లులు మాల్‌లో రాజాసాబ్ టీమ్ సందడి.. ఎందుకో తెలుసా..?

ప్రభాస్ ‘రాజాసాబ్’ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ‘సహనా సహనా’ పాటను హైదరాబాద్ లులు మాల్‌లో ఈవెంట్‌తో విడుదల చేయనున్నారు. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా నిడివి సుమారు 3 గంటల 10 నిమిషాలుగా ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది.

New Update
RajaSaab

RajaSaab

RajaSaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న తాజా సినిమా ‘రాజాసాబ్’ ప్రమోషన్స్ వేగం ఊపందుకుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ ‘రెబల్ సాబ్’ యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా విడుదల చేసిన రెండో పాట ‘సహనా సహనా’(Sahana Sahana) ప్రోమోకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Also Read: "ఓజీ" డైరెక్టర్‌ సుజీత్‌కు పవన్ కాస్ట్లీ కార్ గిఫ్ట్ !! ధర ఎంతంటే?

Rajasaab 2nd Song

ఇప్పుడు ఈ పాట ఫుల్ వెర్షన్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. హైదరాబాద్‌లోని లులు మాల్‌లో రేపు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేసి ‘సహనా సహనా’ పాటను విడుదల చేయనున్నట్లు రాజాసాబ్ టీమ్ ప్రకటించింది. దీంతో అభిమానులు ఈ పాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: 'అఖండ 2' మండే టెస్ట్ పాస్ అయ్యిందా..? కలెక్షన్స్ అంతంత మాత్రమేనా..?

దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే మొదటి నుంచి ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడటం, టీజర్, ట్రైలర్ పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవడం వల్ల హైప్ ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు.

Also Read: సంజయ్ సాహు తిరిగొస్తున్నాడు. ‘జ‌ల్సా’ రీ-రిలీజ్‌.. ఎప్పుడంటే..?

ఇదిలా ఉండగా, తాజాగా ఈ సినిమా నిడివి గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. షూటింగ్ పూర్తయ్యి ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. షూటింగ్ సమయంలో తీసిన మొత్తం ఫుటేజ్ దాదాపు నాలుగు గంటలకుపైగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దీంతో ఎడిటింగ్‌లో భారీగా కట్ చేసినట్లు తెలుస్తోంది.

ఎంత ట్రిమ్ చేసినా సినిమా నిడివి మూడు గంటల 15 నిమిషాల కంటే తక్కువకు రావడం కష్టమయ్యిందట. చివరికి ప్రభాస్, దర్శకుడు మారుతి కలిసి చర్చించి మూడు గంటల 10 నిమిషాల నిడివి వద్ద ఫైనల్ కట్ లాక్ చేశారని టాక్. హారర్ కామెడీ జానర్ కావడంతో ఇందులో పాటలు, కామెడీ సీన్స్ ఎక్కువగా ఉంటాయని సమాచారం.

Also Read: యూట్యూబ్‌లో మరో మైల్ స్టోన్ చేరుకున్న రామ్ చ‌ర‌ణ్ ‘చికిరి చికిరి’.. ఎన్ని వ్యూస్ అంటే..?

కానీ ఈ రోజుల్లో ప్రేక్షకులు పొడవైన సినిమాలపై అంత ఆసక్తి చూపడం లేదన్న మాట కూడా వినిపిస్తోంది. కంటెంట్ బలంగా ఉంటేనే మూడు గంటల సినిమా ప్రేక్షకులను థియేటర్‌లో కూర్చోబెడుతుంది. అందుకే ‘రాజాసాబ్’ నిడివి సినిమాకు ప్లస్ అవుతుందా? లేక మైనస్ అవుతుందా? అన్నది చర్చగా మారింది.

ప్రస్తుతం ఫ్యాన్స్ కూడా చాలా పెద్ద అంచనాలు పెట్టుకోకపోయినా, ప్రభాస్ స్టార్ పవర్, సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ కలిసి వస్తే సినిమా ఎలా నిలబడుతుందో చూడాలి. మారుతి కథనం, ప్రభాస్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయా? లేక మూడు గంటల సినిమా భారంగా అనిపిస్తుందా? అన్నది రిలీజ్ తర్వాతే తేలనుంది. మొత్తానికి ‘రాజాసాబ్’ సినిమా ఇప్పుడు నిడివితో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Advertisment
తాజా కథనాలు