/rtv/media/media_files/2025/06/13/yODK3O3I7t4qblrBVD4N.jpg)
prabhas Raja Saab Teaser Leake on social media
ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం ‘రాజాసాబ్’. ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని త్వరలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి టీజర్ లీక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ప్రభాస్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.
Raja Saab Teaser Leake
ఇదిలా ఉంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ది రాజా సాబ్' మూవీ విడుదల తేదీని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. డిసెంబర్ 5న విడుదల కానున్నట్లు తెలియజేస్తూ ఎక్స్ లో పోస్టర్ షేర్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది.
Warra warra vachesadu Rajasaab#Prabhas #TheRajaSaab #TheRajaSaabTeaser
— . (@Bhavani_99999) June 13, 2025
https://t.co/qYrJyhDaQP
#TheRajaSaabTeaser
— Rajesh (@RVahaniya18076) June 13, 2025
Rajasaab leaked 🥵🥵🥵💥💥💥🫡🫡🫡 pic.twitter.com/21SEfAt36m
ఇది మాత్రమే కాదు ఈనెల 16న మూవీ టీజర్ ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కామెడీ హర్రర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. ఈ సినిమాతో డార్లింగ్ మొదటి సారి హారర్ జానర్ లోకి అడుగుపెడుతున్నారు. అంతేకాదు ఇది ప్రభాస్ కెరీర్‌లో పూర్తిస్థాయి హారర్ ఎంటర్‌టైనర్‌గా నిలవనుంది.
Teaser tho hype inkasthaa zuiiii ani lechuddhii 🔥🔥🔥🥵#TheRajaSaab #TheRajaSaabTeaser#Prabhas pic.twitter.com/yOXAT8thnO
— вєи10 (@demon_slayier) June 13, 2025
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 'కల్కి 2898 AD' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న 'ది రాజా సాబ్'పై అంచనాలు భారీగా ఉన్నాయి.
Elago team leak chesindhi Anni pics and oka 24 seconds video 👻🤦#Prabhas #TheRajaSaab #TheRajasaabteaser pic.twitter.com/LfSYwpyjLh
— Sunnysalaarᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ 🚩 (@GDKRebels) June 13, 2025
అయితే ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఒక స్పెషల్ అప్పియరెన్స్ సాంగ్‌లో మెరవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉన్నతమైన నిర్మాణ విలువలతో భారీ స్థాయిలో ఈ మూవీని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం దాదాపు రూ.300–350 కోట్లుగా ఖర్చు చేస్తున్నట్లు టాక్.