/rtv/media/media_files/KlrERS4UNHNqdKGnVGWY.jpg)
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి గురించి చిన్న అప్డేట్ వచ్చినా అది సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ నెల 23కు డార్లింగ్ 45 వ పడిలో అడుగుపెడతారు. అయినా కూడా ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో పాటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డార్లింగ్ ను కట్టుకోబోయే ఆ అదృష్టవంతురాలు ఎవరో తెలుసుకోవాలని అభిమానులు తహతహలాడుతున్నారు.
అలాంటి ఫ్యాన్స్ కోసం ఇక నుంచి డార్లింగ్ వెడ్డింగ్ కు సంబంధించి వరుస అప్డేట్స్ రాబోతున్నాయట. దసరా పండగ రోజు ప్రభాస్ తన పెళ్లి అప్డేట్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటాడని లేటెస్ట్ న్యూస్ బయటికొచ్చింది. అంతేకాదు తన పుట్టిన రోజు అక్టోబర్ 23న ఎంగేజ్ మెంట్ చేసుకునేందుకు కూడా రెడీ అవుతున్నాడని చెబుతున్నారు.
Prabhas' aunt, Syamala Devi, mentioned that the long-awaited announcement about Prabhas' marriage will be made soon. Who do you think the future bride will be?#Prabhas #TheRaajaSaab pic.twitter.com/qEbTFziSKu
— Dimple Hayathi (Parody) (@hayathidimple) October 9, 2024
అమ్మాయి ఎవరంటే..
డార్లింగ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సినీ పరిశ్రమకు చెందినవారు కాదని తెలుస్తోంది. తన సొంత ఊరు మొగల్తూరుకు చెందిన అమ్మాయినే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడట. ఆ అమ్మాయి ప్రభాస్‌కు దగ్గరి బంధువు అంటున్నారు. ఇప్పటికే పెళ్లి వేడుకలు స్టార్ట్ కావాల్సి ఉండగా.. డార్లింగ్ బిజీ షెడ్యూల్‌తో వాయిదా పడుతూ వచ్చినట్లు చెబుతున్నారు. ఇది విన్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఈ న్యూస్ అయినా నిజమైతే బాగుండని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : 40 ఏళ్ళ వయసులో హీరోయిన్ తో టాలీవుడ్ హీరో పెళ్లి.. అతనెవరో తెలుసా?
రీసెంట్ గా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి.. విజయవాడ కనకదుర్గను దర్శించుకున్నాక.. మీడియాతో ప్రభాస్ పెళ్లి అనౌన్స్‌మెంట్ త్వరలోనే ఉంటుందని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఈ వార్త నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..