/rtv/media/media_files/4vbZcm3xclvym9iA683P.jpg)
టాలీవుడ్ లో 40 ఏళ్ళు దాటినా ఇంకా పెళ్లి చేసుకొని హీరోలు చాలా మంది ఉన్నారు. వారిలో నారా రోహిత్ కూడా ఒకరు. నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్.. 'బాణం' సినిమాతో హీరోగా మారాడు. ఫస్ట్ మూవీతోనే యాక్టర్ గా ప్రశంసలు అందుకున్నాడు.
తర్వాత 'సోలో' మూవీతో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. అందరిలా కాకుండా రౌడీ ఫెలో, అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఒక్కడినే, ప్రతినిధి, అసుర, రాజా చేయి వేస్తే, జో అచ్చుతానంద, శంకర, శమంతక మణి లాంటి డిఫెరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేసి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2018 వరకు వరుస సినిమాలు చేసిన ఈయన.. ఆ తర్వాత ఏమైందో తెలీదు ఆరేళ్ళ పాటూ గ్యాప్ తీసుకున్నాడు.
హీరోయిన్ తో పెళ్లి..
ఈ ఏడాది ‘ప్రతినిధి 2’ మూవీతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో తనతో కలిసి నటించిన హీరోయిన్నే నారా రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నారట. అంతేకాదు ఈ నెల 13 న ప్రతినిధి హీరోయిన్ సిరి లేళ్లతో నారా రోహిత్ ఎంగేజ్ మెంట్ కూడా జరగనుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
Rumors Circulate About #NaraRohit’s Engagement with Actress
— TopTeluguNews (@TheSPRWorld) October 10, 2024
There are rumors that #NaraRohit will get engaged to actress Siri Leela, his co-star from “Pratinidhi-2,” on the 13th of this month. The event, set to take place in Hyderabad, is expected to be attended by… pic.twitter.com/TZ32ZT0g0s
హైదరాబాద్‌లో జరిగే ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీలు కూడా హాజరు కాబోతున్నాయని సమాచారం. అయితే దీనిపై నారా ఫ్యామిలీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.