Fauji ఉగ్రవాదులు దాడి.. ప్రభాస్ హీరోయిన్ బలి!

పహల్గామ్ ఎటాక్ తో ప్రభాస్ ఫౌజీ మూవీపై వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలోని హీరోయిన్ పాకిస్థానీ మిలటరీ ఆఫీసర్ కూతురు కావడంతో విమర్శలు తలెత్తుతున్నాయి. శత్రుదేశాల మూలాలున్న అమ్మాయిని ప్రోత్సహిస్తున్నారు అనే కోణంలో కొందరు నిరసన స్వరం వినిపిస్తున్నారు.

New Update
fauji heroine

fauji heroine

Fauji జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడితో ఊహించని కోణాల్లో వివాదాలు రేపుతోంది. ఈదాడి నేపథ్యంలో ప్రభాస్ 'ఫౌజీ' సినిమా చిక్కుల్లో పడింది. అయితే ఈ సినిమాలోని హీరోయిన్ పాకిస్థానీ అమ్మాయి కావడంతో విమర్శలు తలెత్తాయి. 'ఫౌజీ' లో ప్రభాస్ జోడీగా నటిస్తున్న ఇమాన్వి పాకిస్థానీ మిలిటరీ ఆఫీసర్ కూతురు. దీంతో శత్రుదేశాల మూలాలున్న అమ్మాయిని ప్రోత్సహిస్తున్నారు అనే కోణంలో కొందరు నిరసన స్వరం వినిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  అయితే ఇమాన్వీ కుటుంబం పాకిస్థాన్ కి చెందినది అయినప్పటికీ.. ఆమె పుట్టి పెరిగింది మాత్రం ఢిల్లీలో. 

ఢిల్లీలో జన్మించిన ఇమాన్వి

 ఇమాన్వి తనకు ఎనిమిదేళ్ల వయసులోనే  కుటుంబంతో కలిసి కాలిఫోర్నియాకు వెళ్లింది. ఎంబీఏ పూర్తి చేసిన  తర్వాత యూట్యూబ్ ఛానెల్‌ మొదలు పెట్టి మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ఇమాన్వి పూర్తి పేరు ఇమాన్ ఇక్బాల్ ఇస్మాయిల్ కానీ.. సోషల్ మీడియాలో  ఇమాన్వీ గా పరిచయం.

ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ పహాల్గమ్ దాడి ఘటన యావత్ భారత దేశాన్ని షేక్ చేసింది. మినీ స్విట్జర్ ల్యాండ్ గా పేరొందిన 'పహాల్గమ్' ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చిన ఎంతో మంది అమాయక పర్యాటకులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు పర్యాటకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. బాధిత కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ఈ ఉగ్రవాద దాడిపై ట్వీట్ చేశారు. 

telugu-news | latest-news | cinema-news | prabhas | fouji-2 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు