Pooja Hegde: పాపం పూజా..! 'రెట్రో'తో వరుసగా 7 ఫ్లాపులు..

పూజా హెగ్డే ‘రెట్రో’పై పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. ఇది ఆమెకు వరుసగా ఏడవ ఫ్లాప్. సౌత్, బాలీవుడ్‌లలో పూజా తిరిగి మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి 'జన నాయకన్'తో అయినా ఆమెకు బ్రేక్ వస్తుందేమో చూడాలి.

New Update
Pooja Hegde

Pooja Hegde

Pooja Hegde: టాలీవుడ్‌, కోలీవుడ్‌లో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలన్న లక్ష్యంతో పూజా హెగ్డే ‘రెట్రో’(Retro Movie) సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సూర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ప్రీ రిలీజ్ కి వచ్చిన హైప్ తో ఈ సారి పక్కాగా  పూజా హిట్ కొడుతుందని అంతా అనుకున్నారు. కానీ చివరికి నిరాశే మిగిలింది. విడుదల తర్వాత సినిమాపై వచ్చిన రివ్యూలు, కలెక్షన్లు చుస్తే పూజకి గట్టి దెబ్బె తగిలింది అనిపిస్తోంది. 

అంతేకాదు, 'రెట్రో'తో వరుసగా ఏడవ ఫ్లాప్‌ను మూటగట్టుకుని పూజా హెగ్డే ఒక అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. ‘రాధేశ్యామ్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’, ‘సర్కస్’, ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’, ‘దేవా’ వంటి భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఫ్లాప్ గా నిలిచి పూజా ఇమేజ్‌ను డ్యామేజ్ చేశాయి.

Also Read:మంచితనం నటిస్తారు.. ఇండస్ట్రీపై చిర్రెత్తిపోయిన హాట్ బ్యూటీ!

'జన నాయకన్' మూవీతో అయినా..?

ఒకానొక సమయంలో టాప్ హీరోయిన్‌గా నిలిచిన పూజా, ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమాల్లోనూ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో ఒక పెద్ద ప్రాజెక్ట్‌ను త్వరలో ప్రకటించనున్నట్టు సమాచారం. అలాగే విజయ్ తో చేస్తున్న 'జన నాయకన్' మూవీతో అయినా హిట్ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read:రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్‎లో టెన్షన్ టెన్షన్..!

పూజా కెరీర్‌ మళ్లీ ఊపందుకోవాలంటే, కథా బలమున్న సినిమాలు, టాలెంట్‌ రివీల్ చేసే పాత్రలు చేస్తే కానీ ఆ అవకాశం లేదు. 'రెట్రో' ఫ్లాప్ తో అయినా ఒక గుణపాఠం నేర్చుకొని ఇకపై మంచి సినిమాల మీద అమ్మడు ఫోకస్ పెట్టాలి అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు