BIGG BOSS: గంగవ్వ ఎంత పని చేస్తివి.. అవ్వ పై పోలీస్ కేసు!

బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ, యూట్యూబర్ రాజు పై కేసు నమోదైంది. గంగవ్వ, రాజు 'మై విలేజ్ షో' ఛానెల్ లో వీడియో పేరుతో చిలుకను బందించారని జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ ఫిర్యాదు చేశారు.

New Update
GANGAVVA 11

gangavva

Gangavva :  బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ, 'మై విలేజ్ షో' ఫేమ్ రాజు పై పోలీస్ కేసు నమోదైంది. వీడియోల పేరుతో వన్యప్రాణుల రక్షణ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించారని జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ ఫిర్యాదు చేశారు. అయితే మే 20,2022న 'మై విలేజ్ షో'   యూట్యూబ్ ఛానెల్‌లో గంగవ్వ చిలుక పంచాంగం వీడియో అప్‌లోడ్ చేశారు. ఈ జ్యోతిష్య  చెప్పడానికి చిలుకను బంధించారు. దీంతో యానిమల్ వెల్ఫేర్ మెంబర్ గౌతమ్ వినోదం కోసం పక్షులను ఉపయోగించడం సరికాదని.. వీడియోలో పాల్గొన్న గంగవ్వ, రాజు పై కేసు పెట్టారు. 

Also Read: ఎంతోమంది హీరోయిన్స్ తో నటించినా.. వీళ్లిద్దరే ప్రభాస్ ఫేవరేట్

సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ 

ఇది ఇలా ఉంటే.. సీజన్ 4లో అనుకోని పరిస్థితుల కారణంగా షో మధ్యలోనే వెళ్ళిపోయిన గంగవ్వకు.. బిగ్ బాస్ మరోసారి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సీజన్ 8లో వైల్డ్ కార్డ్ గా మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. ఇక వచ్చిన మొదటి రోజే అవ్వ.. అవినాష్ టాస్క్ ఆడి గెలిచి సూపర్ అనిపించుకుంది. టాస్కుల్లో పెద్దగా ఆడకపోయిన తన శక్తికి తగట్టు అక్కడక్కడ కామెడీ, పంచులు వేస్తూ బాగానే అలరిస్తోంది అవ్వ. 

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

ఒకప్పుడు వ్యవసాయ కూలీ అయిన గంగవ్వ.. ఇప్పుడు అతి పెద్ద సెలెబ్రెటీగా మారింది. 'మై విలేజ్ షో'  అనే ఛానెల్ లో పల్లెటూరి వీడియోలో చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. 60 ఏళ్ళ వయసులో కూడా చలాకీగా వీడియోలు చేస్తూ, గలగలా మాట్లాడే గంగవ్వ అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్కసారిగా  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యింది. అదే పాపులారిటీ తో  బిగ్ బాస్ లో అడుగుపెట్టే అవకాశం దక్కించుకుంది. 

Also Read:  అనుష్క కాదు, కాజల్ కాదు.. ప్రభాస్ కి సరైన జోడీ ఈ హీరోయినే!

Also Read :  మార్నింగ్ వాకింగ్‌కి వెళ్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు