Chikiri Chikiri: 'పెద్ది' సినిమా “చికిరి చికిరి” సాంగ్ రికార్డులు.. 35 గంటల్లోనే ఎన్ని మిలియన్ వ్యూస్ అంటే..!

రామ్ చరణ్ 'పెద్ది' సినిమా మొదటి పాట “చికిరి చికిరి” రికార్డులు సృష్టిస్తోంది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతంలో వచ్చిన ఈ సాంగ్‌ 35 గంటల్లోనే 53 మిలియన్ వ్యూస్ సాధించింది. బుచ్చి బాబు సనా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

New Update
Chikiri Chikiri Peddi Song

Chikiri Chikiri Peddi Song

Chikiri Chikiri: రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “పెద్ది” నుండి వచ్చిన మొదటి పాట “చికిరి చికిరి”(Chikiri Chikiri Peddi Song) ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రానికి దర్శకుడు బుచ్చి బాబు సనా, హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు.

Also Read: SSMB29 తాజా అప్‌డేట్: 'గ్లోబ్ ట్రాటర్' నుంచి ప్రియాంక చోప్రా లుక్ వచ్చేస్తోంది..!

సంగీత మాంత్రికుడు ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఈ పాట విడుదలైన వెంటనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాటలోని ఎనర్జీ, బీట్, రామ్ చరణ్ డ్యాన్స్ స్టెప్స్ అభిమానులను మంత్ర ముగ్ధులను చేశాయి. సోషల్ మీడియా అంతా ఈ పాట హ్యాష్‌ట్యాగ్‌తో నిండిపోయింది.

50 మిలియన్ వ్యూస్ దాటిన ఫాస్టెస్ట్ ఇండియన్ సాంగ్‌

విడుదలైన 24 గంటల్లోనే ఈ పాట భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన సాంగ్‌గా నిలిచింది. కేవలం 35 గంటల్లోనే 53 మిలియన్ వ్యూస్, 1.1 మిలియన్ లైక్స్ సాధించి అద్భుతమైన రికార్డు క్రియేట్ చేసింది. ఇది ఇప్పటివరకు 50 మిలియన్ వ్యూస్ దాటిన ఫాస్టెస్ట్ ఇండియన్ సాంగ్‌గా నిలిచింది.

Also Read: 'కే ర్యాంప్' ఎంటర్టైన్మెంట్..! ఇప్పుడు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే...?

ఈ పాటను ప్రముఖ గాయకుడు మోహిత్ చౌహాన్ పాడగా, కొరియోగ్రఫీని జాని మాస్టర్ చేసారు. జాని మాస్టర్ రూపొందించిన మాస్ డ్యాన్స్ మూవ్స్ ఇప్పుడు అభిమానుల్లో వైరల్ అవుతున్నాయి. పాటలో రామ్ చరణ్ రస్టిక్ లుక్‌లో కనిపించడం, జాన్వీ గ్లామరస్ ప్రెజెన్స్ కలవడంతో వీడియోకు భారీ స్పందన లభిస్తోంది.

Also Read: 'SSMB 29' ఈవెంట్ కు భారీ సెటప్‌.. స్టేజ్ ఎంత పెద్దదో తెలిస్తే..!

సినిమా గురించి చెప్పాలంటే, ఇది పాన్-ఇండియన్ స్థాయిలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

వృద్ధి సినిమాస్ ఈ భారీ సినిమాను నిర్మిస్తోంది. సినిమా విడుదలను మార్చి 27, 2026న ప్లాన్ చేశారు. మొత్తం మీద, “చికిరి చికిరి” పాటతో “పెద్ది” సినిమా మీద హైప్ మరింత పెరిగింది. అభిమానులు ఇప్పటికే ఈ పాటను రీపీట్‌లో వింటున్నారు. ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్, రామ్ చరణ్ ఎనర్జీ, జాని మాస్టర్ డ్యాన్స్ అన్ని కాలిపి ఈ సినిమాకి అద్భుతమైన స్టార్టింగ్ పాయింట్‌గా మారింది.

Advertisment
తాజా కథనాలు