Payal Rajput: 'ఆర్ఎక్స్ 100'(RX 100) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాతోనే గ్లామర్, బోల్డ్‌నెస్, నటన అన్నింటిలో తనదైన మార్క్ చూపిస్తూ, కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన 'ఆర్ఎక్స్ 100' సినిమాలో పాయల్ పాత్ర, ఆమెకు చాలా సినిమాల్లో అవకాశాల గేటు తెరిచింది.
Also Read: Sobhita Dhulipala: ఫైనల్లీ.. ప్రెగ్నెన్సీ పై నోరు విప్పిన అక్కినేని కోడలు.! ఏమన్నారంటే
ఆ సినిమా విజయం తర్వాత వెంకటేష్ సరసన ‘వెంకీ మామ’ సినిమాతో మరో సారి వెండి తెరపై మెరిసింది. తాజాగా 2023లో విడుదలైన 'మంగళవారం' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతోనూ పాయల్ సూపర్ సక్సెస్ కొట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘వెంకట లచ్చిమి’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది.
Also Read: Operation Sindoor: నాన్న జమ్మూలో ఉన్నారు.. రాత్రి ఫోన్ లో ఏమ్మన్నారంటే? సమయ్ రైనా ఎమోషనల్ పోస్ట్
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ పాయల్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ స్టోరీ(Payal Rajput Instagram Story) ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
/rtv/media/media_files/2025/05/10/TdF8rzWZttGrPWC4EAC0.jpg)
Also Read: BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్
పాయల్ ఎమోషనల్ స్టోరీ..
భారత్ పాక్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పాయల్ ఓ ఎమోషనల్ ఫోటో ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ గా పెట్టింది. ఆ ఫోటోలో ఒక భారత జవాన్ వెనక నుంచి బాంబులు, కత్తులు, బుల్లెట్ల తో ప్రత్యర్ధులు దాడి చేస్తున్నా, అతను తన రెండు చేతులతో మనల్నికాపాడుతున్నట్లు ఉంది. ఆ ఫోటో పై పాయల్ "ఒక భారతీయుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడంటే.. దానికి కారణం మన ఆర్మీ. వారు బాడీగార్డుల్లా మన కోసం నిలబడుతున్నారు" అంటూ రాసుకొచ్చింది.
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ, పాయల్ పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె అభిమానులు ఈ సెన్సిటివ్ పోస్ట్‌పై స్పందిస్తూ కామెంట్లలో ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నారు.