/rtv/media/media_files/2025/08/04/ustaad-bhagat-singh-2025-08-04-12-49-55.jpg)
Ustaad Bhagat Singh
Pawan Kalyan: సినీ కార్మికుల సమ్మే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చిక్కుల్లో పడింది. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవగా.. అక్కడక్కడ మిగిలిపోయిన కొన్ని ప్యాచ్ వర్క్స్ ఇంకా జరుగుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ సినీ కార్మికుల సంఘం సమ్మే ప్రకటించడంతో.. ముంబై, చెన్నై నుంచి వర్కర్స్ ని తెప్పించి షూటింగ్ పనులు నిర్వహిస్తున్నారు నిర్మాతలు.
అయితే ఈ విషయం ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులకు తెలియడంతో షూటింగ్ ఆపడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక్కడ సినీ కార్మికులు సమ్మే నిర్వహిస్తుండగా షూటింగ్ ఎలా నిర్వహిస్తారని మేకర్స్ ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మా కార్మికుల కష్టం హీరో పవన్ కి తెలియదా అని మండిపడుతున్నారట యూనియన్ సభ్యులు. షూటింగ్ ఆపే క్రమంలో అక్కడ కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడినట్లు సమాచారం. దీంతో పవన్ ఉస్తాద్ షూటింగ్ కి బ్రేకులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. 'గబ్బర్ సింగ్' తర్వాత పవర్ స్టార్- హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న రెండవ సినిమా ఇది. దీంతో ఈమూవీ పై ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది.
సినీ కార్మికుల సమ్మే ఎందుకు?
అయితే తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తమ వేతనాలను 30 శాతానికి పెంచితేనే షూటింగ్స్ లో పాల్గొంటామని డిమాండ్ చేస్తూ సమ్మే ప్రకటించింది. వేతనాలను 30 శాతానికి పెంచుతామని, పెంచిన వేతనాలను ఏరోజుకు ఆరోజే చెల్లిస్తామని నిర్మాతలు రాతపూర్వకంగా హామీ ఇస్తేనే కార్మికులు(జూనియర్ ఆర్టిస్ట్స్, ప్రొడక్షన్ బాయ్స్, లైట్ మెన్స్, సినిమా యూనిట్ లో పనిచేసేవారు) షూటింగ్స్ కి వెళ్తారని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కొన్ని డిమాండ్స్ తో ఒక లేఖను విడుదల చేసింది. ఆ డిమాండ్స్ అంగీకరించని నిర్మాతల షూటింగ్ లకి సినీ కార్మికులెవరూ హాజరుకాకూడదని ఫెడరేషన్ తెలిపింది. నిబంధనలకు వ్యక్తిరేకంగా ఎవరైనా షూటింగ్ పాల్గొంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. సినీ కార్మికుల బంద్ తో మరోసారి టాలీవుడ్ లో సంక్షోభం నెలకొంది. ఇక ఈ సమస్యకు పరిష్కారం దొరికే వరకు షూటింగ్స్ అన్నీ కూడా ఎక్కడిక్కడా నిలిచిపోయే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రిత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్లు(నిర్మాతలు), ఎగ్జిబిటర్ల(థియేటర్ యజమానులు) మధ్య పర్సెంటేజ్ ల వివాదం చర్చకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలను రెంటల్ పద్దతిలో ప్రదర్శించలేమని.. పర్సెంటేజ్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేశారు. రెంటల్ పద్దతి ద్వారా నిర్మాతలు(డిస్ట్రిబ్యూటర్లు) మాత్రమే లాభపడుతున్నారని.. తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతలు పర్సెంటేజ్ రూపంలో చెల్లిస్తేనే థియేటర్స్ లో సినిమాలను ప్రదర్శిస్తామని తేల్చి చెప్పారు. ఈ విషయంపై ఫిల్మ్ ఛాంబర్ లో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది.
Also Read: Tollywood : సంక్షోభంలో టాలీవుడ్.. రేపటి నుంచి షూటింగ్స్ బంద్!