నువ్వు సూపర్ అన్నయ్య.. నా జీవితానికి నువ్వే హీరో.. చిరుపై పవన్ ఎమోషనల్ ట్వీట్!

చిరంజీవి లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ పురస్కారం అందుకోవడంపై పవన్ కళ్యాణ్ శుభకాంక్షలు తెలియజేశారు. నా జీవితానికి మార్గం చూపించిన వ్యక్తి చిరంజీవి. యూకే జీవిత సాఫల్య పురస్కారంతో..ఆయన కీర్తి మరింత పెరిగింది. నా జీవితానికి నువ్వే హీరో అన్నయ్య''అంటూ ట్వీట్ చేశారు. 

New Update
Pawan Kalyan wishes to Chiranjeevi

Pawan Kalyan wishes to Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి యూకే ప్రభుత్వం నుంచి  లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ పురస్కారం అందుకోవడంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దాదాపు యూభై ఏళ్ళుగా ఆయన సినీ రంగానికి అందించిన సేవలకు గాను ఈ అవార్డు వరించింది. యూకే  పార్లమెంట్‌ సభ్యులు సోజన్‌ జోసెఫ్‌, బాబ్‌ బ్లాక్‌మాన్‌ తదితరులు సమక్షంలో చిరంజీవికి అవార్డు ప్రధానం జరిగింది. స్టాక్ పోర్ట్ ఎంపీ శ్రీనవేందు మిశ్రా ఆధ్వర్యంలో అవార్డు వేడుకను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Kiss Song: 'కిస్' సాంగ్ తో.. పిచ్చెక్కించిన వైష్ణవి, సిద్దూజొన్నలగడ్డ.. చూశారా!

అన్నయ్యే నా హీరో.. 

ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవికి శుభకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా అన్నయ్య కోసం సుదీర్ఘ పోస్టును షేర్ చేశారు. ''చిరంజీవి గారిని ఒక అన్నయ్య గా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను. నేను ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నప్పుడు.. మార్గం చూపించిన వ్యక్తి చిరంజీవి. యూకే జీవిత సాఫల్య పురస్కారంతో..ఆయన కీర్తి మరింత పెరిగింది. నా జీవితానికి నువ్వే హీరో అన్నయ్య'' అంటూ ట్వీట్ చేశారు.  అలాగే  ఈ పురస్కార కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన  స్టాక్ పోర్ట్ ఎంపీ శ్రీ నవేందు మిశ్రాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Also Read:  Fight Obesity: రజినీకాంత్, చిరు, మమ్ముట్టిని నామినేట్ చేసిన మోహన్ లాల్.. ఎందుకంటే?

పవన్ కళ్యాణ్ పోస్ట్ 

Also Read: Irregular periods: పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? ఈ ఆహారాలు తీసుకోండి

Advertisment
Advertisment
తాజా కథనాలు