తీవ్ర అనారోగ్యం బారిన పడ్ద పవన్ కళ్యాణ్.. ఆందోళనలో అభిమానులు

పవన్ కళ్యాణ్ తీవ్ర అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. ఆయన జ్వరంతోపాటూ జలుబు, దగ్గుతో బాధపడుతున్నారట. అందుకే అందుకే ఇవాళ జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశానికి రాలేదు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.

New Update
pk 2

సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య తరచూ అస్వస్థతకు లోనవుతున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన తీవ్ర అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. అందుకే ఇవాళ జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశానికి రాలేదు. ఆయన జ్వరంతోపాటూ.. జలుబు, దగ్గుతో బాధపడుతున్నారట. అందుకే క్యాబినెట్ సమావేశానికి రాలేదని అంటున్నారు. 

ఈమధ్య ఆయన తిరుమలకు మెట్లు ఎక్కుతూ వెళ్లిన విషయం తెలిసిందే కదా. ఆ సమయంలోనే పవన్ అస్వస్థతకు లోనయ్యారు. ఇప్పుడు అదే జ్వరానికి దారి తీసిందని సమాచారం. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Also Read : 'దేవర' పార్ట్-3 కూడా ఉందా? కొరటాల శివ ఏం చెప్పాడంటే?

గతంలోనూ అంతే..

పవన్ కళ్యాణ్‌కి అస్వస్థత అనేది తరచూ వస్తూనే ఉంది. ఆయన కొద్దిగా ఎండలోకి వెళ్లినా ఆరోగ్యం తేడా వచ్చేస్తోంది. ఇది వరకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్లగానే ఆయనకు జ్వరం వచ్చేసేది. ఇలా చాలా సార్లు జరిగింది. ఈ కారణంగానే ఆయన కొన్ని ప్రచారాలను కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చేది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు