Pawan Kalyan
ఫస్ట్ సింగిల్ అప్డేట్
"హరిహర వీరమల్లు'' మొదటి పాట లాంచ్ తేదీని ప్రకటించారు. ఫస్ట్ సింగిల్ '' మాట వినాలి'' పాటను జనవరి 6 6 ఉదయం గం. 9:06 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాపై మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇవ్వడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా పాడడం విశేషం. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.
2025 just got POWER-packed! ⚔️ 🔥
— BA Raju's Team (@baraju_SuperHit) December 31, 2024
Let's Celebrate this New Year with #MaataVinaali ~ The first single from #HariHaraVeeraMallu will be out on Jan 6th, 2025 at 9:06AM.💥
Sung by the one and only, POWERSTAR 🌟 @PawanKalyan garu 🎶🎤
A @mmkeeravaani Musical 🎹
📝 Lyrics by… pic.twitter.com/JhDdYnoXDu
జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నోరా ఫతేహి సెకెండ్ హీరోయిన్ గా కనిపించనుంది. యాంకర్ అనసూయ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ కేర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరో 10 రోజుల్లో పూర్తి షూటింగ్ కంప్లీట్ అవనున్నట్లు సమాచారం.