OG Movie: షాకింగ్ వీడియో: ఓజీ ఫ్యాన్స్‌ను తరిమికొట్టిన ఆ పార్టీ కార్యకర్తలు.. థియేటర్ వద్ద ఉద్రిక్తత..!

పవన్ కల్యాణ్ ‘ఓజీ’ మూవీ ప్రీమియర్స్ వేళ.. కన్నడలో రచ్చ రచ్చ జరిగింది. ఓ థియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ కటౌట్స్, పోస్టర్స్ ఏర్పాటు చేయగా.. ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఫ్యాన్స్‌ను చెదరగొట్టారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

New Update
og premieres

og premieres

పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ వాతావరణం తీసుకొచ్చిన సినిమా 'ఓజీ' (OG). సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం సుమారు రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. అలాగే, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా పరిచయమవుతుండటం సినిమాకు మరింత బజ్ తెచ్చిపెట్టింది.

pawan kalyan og movie 

సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు అడ్వాన్స్ బుకింగ్‌లో ఊహించని స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ప్రీమియర్ షోలకు అడ్వాన్స్ బుకింగ్‌లు రికార్డు స్థాయిలో జరిగాయి. కొన్ని చోట్ల టికెట్ల ధరలు లక్షల్లో అమ్ముడయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి 'ఎ' సర్టిఫికెట్ లభించింది. హింస ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. టీజర్, ట్రైలర్‌లలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ లుక్‌ అభిమానులను బాగా ఆకట్టుకుంది. 

ఇవాళ ఈ మూవీ ప్రీమియర్స్ పడ్డాయి. ఈ క్రమంలో కన్నడలో ఈ మూవీ సంచలనంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఓజీ’ మూవీ సంబరాలు జరుగుతుండగా.. కన్నడలో మాత్రం ఈ మూవీకి చెక్ పెట్టాలని కొందరు చూస్తున్నట్లు తెలుస్తోంది. కన్నడలో పవన్ ఫ్యాన్స్ భారీగా థియేటర్ వద్ద కటౌట్‌లు, పోస్టర్లు పెట్టి హంగామా చేస్తుండగా.. ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు థియేటర్ వద్దకు చేరుకుని వారిని అక్కడ నుంచి తరిమేసే ప్రయత్నం చేశారు. కర్రలు, చెక్కలు విసిరి వారిని బెదిరించారు. దీంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Advertisment
తాజా కథనాలు