/rtv/media/media_files/2025/09/28/og-comic-book-2025-09-28-14-29-37.jpg)
OG Comic Book
OG Comic Book: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన "OG - They Call Him OG" సినిమా సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది, అయితే సినిమా టీం ఫ్యాన్స్ కోసం మరో స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. రిలీజ్ కి ముందు అభిమానులతో ఒక చిన్న గేమ్ కాంటెస్ట్ నిర్వహించిన టీం ఇప్పుడు ఆ సర్‌ప్రైజ్‌ను బయటపెట్టింది. అదే 'OG: The First Blood' అనే కామిక్ బుక్.
Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!
#OG Comic Book Out Now pic.twitter.com/nZivQG9CiU
— Lights Camera Action (@LightCinema0803) September 28, 2025
ఈ కామిక్‌లో పవన్ కళ్యాణ్ పోషించిన మాస్టర్ Orochi Genshin (OG) అనే సమురాయ్ పాత్రకు సంబంధించిన చరిత్రను చూపించారు. ఆయన జీవితంలో జరిగిన గత సంఘటనలు, ఓజస్ గంభీర్ అనే పాత్రతో ఉన్న అనుబంధం, తదితర విషయాలను ఇందులో ప్రెసెంట్ చేసారు. ఈ కామిక్ బుక్ డిజిటల్ రూపంలో విడుదల కాగా, ధర రూ. 360గా ఉంది. దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియో గ్లింప్స్ కూడా ఆన్‌లైన్‌లో విడుదలైంది.
Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!
నైజాం లోనే రూ. 30 కోట్లు
ఇదిలా ఉండగా, OG సినిమా బాక్సాఫీస్ వద్ద జోరుగా కొనసాగుతోంది. తొలి రోజే నైజాంలో ₹24 కోట్లు షేర్ వసూళ్లు రాబట్టిన OG, రెండో రోజుకి కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు నైజాం షేర్ ₹5.9 కోట్లు వచ్చాయి, మొత్తం రెండు రోజుల్లో నైజాం లోనే రూ. 30 కోట్లు దాటింది. ఈ దూకుడు చూస్తే, మూడో రోజైన ఆదివారం ముగిసేలోపు OG సినిమా ₹200 కోట్ల గ్రాస్ మార్క్ దాటే అవకాశం కనిపిస్తోంది.
Also Read: ‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..
ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్‌తో పాటు ఇమ్రాన్ హాష్మీ (విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ), ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి తదితరులు నటిస్తున్నారు. దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో DVV ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై డి.వి.వి దానయ్య ఈ సినిమాను నిర్మించారు. సంగీతాన్ని ఎస్.ఎస్. తమన్ అందించారు.
మొత్తానికి, OG సినిమా కేవలం థియేటర్లలోనే కాదు, ఇప్పుడు కామిక్ రూపంలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ సినిమా పవన్ కెరీర్‌లో మరో భారీ హిట్‌గా నిలవడం ఖాయం అనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.