/rtv/media/media_files/2025/09/30/og-collections-2025-09-30-16-48-29.jpg)
OG Collections
OG Collections: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన తాజా సినిమా OG బాక్సాఫీస్(OG Box Office Collections) దగ్గర తుఫాను సృష్టిస్తోంది. సుజీత్(Director Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా, విడుదలైన తొలి మూడు రోజుల్లోనే రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇది పవన్ కెరీర్‌లోనే ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
'OG' డే 5 కలెక్షన్స్.. (OG Day 5 Collections)
సినిమా మొదటి సోమవారం (డే 5)కు సంబంధించి ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు, OG ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. టికెట్ ధరలు పెంచడం వల్ల మొదట్లో జానాల సంఖ్య కొంత తగ్గినప్పటికీ, ఇప్పుడు తెలంగాణలో టికెట్ రేట్లు మళ్లీ సాధారణ స్థాయికి తీసుకురావడం వల్ల రాబోయే రోజుల్లో OG కలెక్షన్లు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.
Also Read: ‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..
OG సినిమా ఈ ఏడాది తెలంగాణలో “పుష్ప 2” తర్వాత రెండవ అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమా కావడం విశేషం. సినిమా ప్రస్తుత పేస్ చూస్తే, త్వరలోనే రూ. 300 కోట్ల గ్రాస్ మార్క్ చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో ఇమ్రాన్ హాష్మీ విలన్ పాత్రలో టాలీవుడ్‌కి పరిచయమవగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ మధ్య వచ్చే సీన్లు అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక సంగీతం విషయానికి వస్తే, ఎస్.ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలాన్ని చేకూర్చింది.
Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!
ఈ చిత్రంలో శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, ఉపేంద్ర లిమయే, హరీష్ ఉత్తమన్, సుధేవ్ నాయర్ వంటి నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య, కళ్యాణ్ దాస్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
ఇక కొన్ని రోజుల్లో దసరా హాలీడే సీజన్ వస్తుండటంతో OGకి మంచి వసూళ్లు వచ్చే అవకాశముంది. అయితే అదే సమయంలో విడుదల కానున్న కాంతారా: చాప్టర్ 1 సినిమా OGకు ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
మొత్తానికి, OG సినిమా మరోసారి పవన్ కళ్యాణ్ మాస్ స్టామినా ఏంటో రుజువు చేసింది. ఇప్పటి వసూళ్లు చూస్తే ఈ సినిమా రన్ ఇంకా కొనసాగుతూ మరిన్ని రికార్డులు తిరగరాయటం ఖాయంగా కనిపిస్తోంది.