ఆఖరి అధ్యాయం మొదలు.. 'హరిహర వీరమల్లు' సెట్స్ లోకి పవన్ ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'హరిహర వీరమల్లు'. అయితే కొన్ని రోజులుగా రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల షూటింగ్ లకు దూరంగా ఉన్న పవన్.. తాజాగా సెట్స్ లో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update
pawan kalyan (1)

pawan kalyan

Pawan kalyan: ఆంద్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్  'హరిహరవీరమల్లు'(Hari Hara Veera Mallu). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో.. ఆయనకు సంబంధించిన షూట్ మినహాయించి మిగిలిన పార్ట్ చిత్రీకరిస్తున్నారు. 

సెట్స్ లో జాయిన్ అయిన పవన్ 

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తిరిగి షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.  ''ధర్మం కోసం పోరాటం లో ఆఖరి అధ్యాయం మొదలు! అంటూ చివరి షెడ్యూల్ లో పోస్టర్ షేర్ చేశారు.  విజయవాడలో జరగనున్న ఈ చివరి షెడ్యూల్ లో పవన్ పాల్గొననున్నారు. పవన్ బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రయూనిట్ విజయవాడలో మూవీ సెట్‌ వేసింది. 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

ఈ చిత్రం రెండు పార్టులుగా విడుదల కానుంది. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన  గ్లింప్స్, టీజర్ సినిమా అంచనాలను పెంచేశాయి.  పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలి పాన్ ఇండియన్ మూవీగా ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది. 

Also Read: జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా

Also Read: అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. పోలీసులకు ఫిర్యాదు!

Advertisment
Advertisment
తాజా కథనాలు