Allu Arjun: అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. పోలీసులకు ఫిర్యాదు! అల్లు అర్జున్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఫ్యాన్స్‌కు "అల్లు అర్జున్ ఆర్మీ" అని పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు బైరి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు. కాగా దీనిపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది వేచి చూడాలి. By V.J Reddy 30 Nov 2024 in సినిమా హైదరాబాద్ New Update షేర్ చేయండి Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై జవహర్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు అందింది. ఫ్యాన్స్‌కు "అల్లు అర్జున్ ఆర్మీ"(Allu Arjun Army) అని పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బైరి శ్రీనివాస్ గౌడ్(Bairi Srinivas Goud) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్మీ అంటే దేశ భద్రత, రక్షణకు ఉపయోగించే గౌరవప్రదమైన పేరుగా భారతీయులు భావిస్తారని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఆర్మీ అనే పదాన్ని అల్లు అర్జున్ పదేపదే వ్యక్తిగతంగా వాడడం కరెక్ట్ కాదని హితవు పలికారు. ఇది కూడా చదవండి: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్ చేస్తే ఇంటి వద్దకే..! అవమానించినట్లే... వ్యక్తులకు ఆర్మీ అని పేరు పెట్టుకుంటే భారతీయ రక్షణ వ్యవస్థను అవమానించినట్లే అని పేర్కొన్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు గ్రీన్ పీస్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్(Bairi Srinivas Goud). కాగా పుష్ప సినిమా 2(Pushpa-2) ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ వివిధ రాష్ట్రాలలో పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సభలో ప్రసంగిస్తూ.. తన అభిమానులు.. తన ఆర్మీ.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆర్మీ అంటూ స్టేజీలపై వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా పుష్ప విడుదల అయ్యే సమయంలో అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు అందడం కలకలం రేపింది. కాగా అల్లు అర్జున్ పై పోలీసుల తదుపరి యాక్షన్ ప్లాన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు షాక్.. మరోసారి పెరగనున్న విద్యుత్ ఛార్జీలు ఇది కూడా చదవండి: భారత్‌తో కంగారు రెండో మ్యాచ్.. పింక్ బాల్‌కు వేదిక కానున్న అడిలైడ్ ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో అరబ్ షేక్ అరాచకం.. 12 ఏళ్ల బాలికలతో కాంట్రాక్ట్ మ్యారేజ్... #Allu Arjun Army #Bairi Srinivas Goud మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి