/rtv/media/media_files/2025/09/20/pawan-kalyan-og-2025-09-20-13-53-07.jpg)
Pawan Kalyan OG
Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా OG (They Call Him OG) పైన అభిమానులలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది - అదేంటంటే, పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ హాఫ్‌ను చూశారట!
OG సినిమాకు సంగీతం అందించిన తమన్ ఇటీవల Aha ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అవుతున్న ఇండియన్ ఐడల్ సీజన్ 4 షోలో జడ్జ్‌గా ఉన్నారు. OG సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్ ప్రియాంక మోహన్ ఆ స్పెషల్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా వచ్చారు. ఇదే సందర్భంలో తమన్ పవన్ కళ్యాణ్ OG ఫస్ట్ హాఫ్ చూసిన విషయాన్ని పంచుకున్నారు.
Also Read: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?
తమన్ మాట్లాడుతూ,
“ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్లీ స్టూడియోకు వచ్చారు. OG సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను చూశారు. ఆ విజువల్స్ చూసిన తర్వాత ఆయనకు బాగా నచ్చాయి. సినిమాను ఆయన ఎంతో ఎంజాయ్ చేశారు. 'వాషి యో వాషి' పాటను రికార్డ్ చేస్తున్నప్పుడు OG హుడీ వేసుకోమని అడిగితే, వెంటనే ఆనందంగా హుడీ వేసుకున్నారు. ఇది చూసి చాలా ఆనందంగా అనిపించింది” అని అన్నారు.
ఇటీవల OG నుండి వచ్చిన ‘వాషి యో వాషి’ వీడియో కాన్టెంట్‌తో అభిమానుల్లో ఎక్సైట్మెంట్ మరింత పెరిగింది. ఈ పాటలో పవన్ కళ్యాణ్ జపనీస్ పోయెమ్ పాడటం విశేషం. OG సినిమాను దర్శకుడు సుజీత్ ఎంతో స్టైలిష్‌గా తెరకెక్కిస్తున్నారని ట్రైలర్స్, టీజర్స్ చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా పైన శ్రద్ధ పెట్టారు.
Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద మాఫియా.. అల్లు అరవింద్ క్రెడిట్స్ కొట్టేస్తాడు: బండ్ల గణేష్
ఈ మూవీకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ సెప్టెంబర్ 21 ఉదయం 10:08కి విడుదల కానుంది. ఇప్పటికే పాటలు, టీజర్‌లకు మంచి స్పందన రావడంతో ట్రైలర్ పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ OG సినిమా ఫస్ట్ హాఫ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారాణి ఇటీవల తమన్ ఓ ప్రోగ్రామ్ లో తెలిపారు. అయితే OG ట్రైలర్ విడుదలకి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.