/rtv/media/media_files/2025/09/22/og-ticket-price-2025-09-22-18-18-18.jpg)
OG Ticket Price
OG Ticket Price: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ OG విడుదలకు ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఓ ఒరిజినల్, మాస్ యాక్షన్ సినిమాలో పూర్తి స్థాయిలో కనిపించబోతుండటంతో, అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఎక్కడ చూసినా OG.. OG.. OG..!
OG సినిమా మొదటి టీజర్ నుంచీ, పాటలు, పోస్టర్స్ వరకు ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వచ్చాయి. బయటకొచ్చిన ప్రతి విజువల్ పవన్ ఫ్యాన్స్ ని ఫుల్ శాటిస్‌ఫై చేశాయి. సినిమాకు సంబంధించి విడుదలైన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.
ఈ మూవీ పవన్ కెరీర్‌లో మరో భారీ సెలబ్రేషన్ కాబోతుందని స్పష్టంగా అర్థమవుతుంది. OG సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ చాలా స్టైలిష్‌గా, పవన్ పర్సనాలిటీకి తగ్గట్టు డిజైన్ చేశాడని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
Also Read : 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి గూస్ బంప్స్ అంతే!
తెలుగు రాష్ట్రాల్లో OG కోసం ప్రేక్షకులు, అభిమానులు భారీగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 25న అన్న షోలు ప్రీ బుకింగ్స్ హౌస్‌ఫుల్ అయ్యాయి. టికెట్ ధర ఎంతైనా సరే, పవన్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందేనంటూ అభిమానులు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు.
కొన్నిచోట్ల OG టికెట్లు వేలం వేయడం జరుగుతోంది. టికెట్ ధరలు వేలు నుంచి లక్షల్లో వెళ్లిపోతున్నాయి. పవన్ పాపులారిటీతోనే ఇది సాధ్యమవుతోంది.
రూ.1.50 లక్షలకు OG టికెట్ కొనుగోలు చేసిన నాయకుడు
అయితే తాజాగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. జనసేన పార్టీ భీమిలి మండల అధ్యక్షుడు నక్క శ్రీధర్, OG సినిమాకు సంబంధించిన టికెట్‌ను ఏకంగా రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశారు. పవన్ సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పార్టీ అవసరాలకు, సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడతాయని నమ్మకంతోనే ఈ వేలంలో పాల్గొన్నానని శ్రీధర్ తెలిపారు.
ఇక OG సినిమా విషయానికొస్తే, సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నారు. యాక్షన్, ఎమోషన్, స్టైల్ అన్నీ ప్యాకేజ్‌గా ఉండేలా దర్శకుడు సుజీత్ కథను తెరకెక్కించారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించగా, తమన్ బాణీలు అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. విజువల్స్, డైలాగ్స్, ఫైట్లతో పవన్ అభిమానుల కోసం OG సినిమాను ఓ మాస్ ఫెస్టివల్‌గా రూపొందించారు.
Also Read: OG: ఓజీ ప్రీ రిలీజ్ లో పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీ.. వైరలవుతున్న ఫొటోలు
ఇంకో 2 రోజుల్లో OG ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. టికెట్‌ల కోసం అభిమానులు పోటీపడుతున్నారు. ఈ క్రేజ్ చూస్తుంటే, OG సినిమా పవన్ కెరీర్‌లో ఓ మెమరబుల్ మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.