/rtv/media/media_files/2025/09/30/og-universe-2025-09-30-19-06-20.jpg)
OG Universe
OG Universe: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన లేటెస్ట్ మూవీ 'OG' విడుదల తర్వాత బాక్సాఫీస్(OG Box Office Collections) దగ్గర భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. సుజీత్(Director Sujeeth) దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా, విడుదలైన తొలి మూడు రోజుల్లోనే రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, పవన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది.
Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!
ఇటీవల హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో 'OG' స్పెషల్ స్క్రీనింగ్(OG Special Screening) ఏర్పాటు చేశారు. ఈ స్క్రీనింగ్‌కు మెగా కుటుంబం(Chiranjeevi Wached OG) మొత్తం హాజరైంది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అలాగే కుటుంబ సభ్యులు, 'OG' టీం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
❤️🤞🏻 pic.twitter.com/mgrz37rMt8
— DVV Entertainment (@DVVMovies) September 30, 2025
సినిమా చూశాక పవన్ కళ్యాణ్ ఎంతో భావోద్వేగంతో మాట్లాడుతూ, “సినిమా ఎంత గొప్పగా ఉండాలన్నా, మంచి టీమ్ లేకపోతే సాధ్యపడదు. 'OG' ఒక మంచి సినిమా. హిట్ ఆవుతుందా? కలెక్షన్స్ వస్తాయా? అనేది పక్కన పెడితే, సినిమా చూస్తే గర్వంగా ఉంది,” అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల హృదయాలు గెలుచుకుంటున్నాయి.
Also Read: ‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..
'OG' యూనివర్స్ ప్రారంభం.. (Pawan Kalyan Announced OG Universe)
అలాగే, పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అదేంటంటే, 'OG' యూనివర్స్ ప్రారంభం అవుతోందని చెప్పారు. “ఇది సుజీత్ గారి క్రియేషన్. రవి చంద్రన్ గారు, నవీన్ నూలి అద్భుతంగా పని చేశారు. తమన్ టాలెంట్‌ను సుజీత్ బాగా ఉపయోగించారు. 'OG' యూనివర్స్‌లో భాగమవుతున్నందుకు గర్వంగా ఉంది,” అంటూ సుజీత్, తమన్ చేతులు పట్టుకుని భావోద్వేగంగా మాట్లాడారు.
'OG' సినిమాలో ఇమ్రాన్ హాష్మీ విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. ఇక సహాయ పాత్రల్లో శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, ఉపేంద్ర లిమయే, హరీష్ ఉత్తమన్, సుధేవ్ నాయర్ కీలకంగా కనిపించారు. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద బలంగా నిలిచింది.
Also Raed: అన్‌బిలీవబుల్.. 'OG' డే 5 కలెక్షన్ల మోత..!
డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థపై డివివి దానయ్య, కళ్యాణ్ దాస్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక దసరా హాలీడే సీజన్ రాబోతుండటంతో 'OG' వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అదే సమయంలో విడుదల కానున్న 'కాంతారా: చాప్టర్ 1' సినిమా కలెక్షన్‌పై ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి.
మొత్తం మీద, OG సినిమా కేవలం ఒక హిట్ సినిమాగా కాదు, ఒక యూనివర్స్ రూపంలో విస్తరించబోతుండటంతో మెగా ఫ్యాన్స్‌కి ఇది డబుల్ సెలబ్రేషన్ లా మారింది.