OSCAR ACADAMY: ఆస్కార్ అవార్డ్స్ లో కొత్త కేటగిరీ.. RRR స్టెంట్ విజువల్ తో అకాడమీ పోస్టర్!

ఆస్కార్ అకాడమీ కొత్త అవార్డు కేటగిరీని ప్రకటించింది. ఇకపై స్టెంట్ డిజైన్ జాబితాలో కూడా అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌, మిషన్‌ ఇంపాజిబుల్‌, RRR స్టెంట్ విజువల్స్ తో కూడిన పోస్టర్ రిలీజ్ చేసింది.

New Update
STUNT DESIGN CATOGORY IN OSCARS

STUNT DESIGN CATOGORY IN OSCARS

OSCAR ACADAMY: సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఆస్కార్ ఒకటి. ప్రతీ ఏడాది నటీనటులు, చిత్రనిర్మాతలు, దర్శకులు ఆస్కార్ జాబితాలో తన పేరు ఉండాలని ఆశగా ఎదురుచూస్తారు. అయితే తాజాగా ఆస్కార్ అకాడమీ కమిటీ చిత్ర పరిశ్రమకు గుడ్ న్యూస్ చెప్పింది.  కొత్త అవార్డు కేటగిరీని ప్రవేశ పెడుతున్నట్లు తెలిపింది. 'అచీవ్‌మెంట్ ఇన్ స్టంట్ డిజైన్' ఈ కేటగిరీని అనౌన్స్ చేసింది. అంటే ఇకపై 'స్టెంట్ డిజైన్' విభాగంలో కూడా అవార్డు ప్రదానం ఉండనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ  'ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’, ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’, 'ఆర్ఆర్ఆర్' స్టెంట్ విజువల్స్ తో కూడిన పోస్టర్ రిలీజ్ చేసింది. 

తొలి చిత్రంగా.. 

ఇదిలా ఉంటే 'ఆర్ఆర్ఆర్' తొలి ఆస్కార్ గెలుచుకున్న భారతీయ సినిమా చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 'నాటునాటు' పాటకు ఆస్కార్ వరించింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. జపాన్ వంటి దేశాల్లో 100 రోజుల థియేట్రికల్ రన్ తో రికార్డు క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ రూ.1350కోట్లకు  పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో మరో పాన్ వరల్డ్ సినిమాకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మొదలైన ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

telugu-news | latest-news | cinema-news

Also Read: NTR: ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్.. పవన్ కొడుకు కోసం ఎన్టీఆర్ ట్వీట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు