/rtv/media/media_files/2025/05/10/SL8q5FBYV9lCPhdJaCbL.jpg)
operation sindoor movie
Operation Sindoor: బాలీవుడ్ డైరెక్టర్ ఉత్తమ్ మహేశ్వరి 'ఆపరేషన్ సిందూర్' పై సినిమా అనౌన్స్ పోస్టర్ విడుదల చేయడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థుల కొనసాగుతుండగా.. ఇలాంటి సమయంలో మూవీ అనౌన్స్ చేయడం పై నెటిజన్లను ఆగ్రహానికి గురిచేసింది. స్క్రిప్ట్ లేదు, కాస్ట్ లేదు, కేవలం టైటిల్ తో జనాలను గ్రాబ్ చేయాలని అనుకుంటున్నారు అంటూ డైరెక్టర్ పై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. దీంతో డైరెక్టర్ ఉత్తమ్ క్షమాపణలు చెబుతూ సోషల్ వేదికగా ఓ పోస్ట్ రిలీజ్ చేశారు.
డైరెక్టర్ క్షమాపణలు
''ఈ టైటిల్ ని నేను పేరు కోసమో, డబ్బుల కోసమో వాడుకోవడం లేదు. దేశ సైనికుల త్యాగం, ధైర్యానికి కదిలిపోయి సినిమా తీయాలని అనుకున్నాను. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. దేశం పట్ల గౌరవం, ప్రేమతో రూపొందించబడింది. కాకపోతే సినిమా అనౌన్స్ చేసిన సమయం, సందర్భం మిమల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు.. దానికి నేను చింతిస్తున్నాను. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు క్షమించండి'' అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
Bollywood film #OperationSindoor sparked outrage after its poster dropped mid real-life military op no cast, no script, just a title grab.
— Filmyscoops (@Filmyscoopss) May 10, 2025
Public backlash forced a takedown and apology. Over 30 production houses raced for similar titles. pic.twitter.com/FApimWfkDg